సినిమాల్లేక ఖాళీగా ఉన్న హీరోయిన్లు రాహుల్ గాంధీ పాదయాత్రకు..

Update: 2022-12-02 07:48 GMT
భారత్ జోడో యాత్ర పేరిట రాహుల్ గాంధీ చేపట్టిన 'పాదయాత్ర' కన్యాకుమారి నుంచి మొదలై కశ్మీర్ వరకూ సాగుతోంది. అయితే ఈ పాదయాత్రలో పలువురు హీరోయిన్లు పాల్గొని రాహుల్ తో కలిసి నడవడం ఆసక్తి రేపుతోంది. అయితే ఈ హీరోయిన్లు ప్రస్తుతం ఫుల్ ఫాంలో ఉన్న వారు కాదు.. ఔట్ డేటెడ్ వివాదాస్పద హీరోయిన్లే కావడం విశేషం.

రాహుల్ గాంధీ పాదయాత్రకు మంచి స్పందన వస్తోంది. వివిధ వర్గాల నుంచి ఆయనకు  మద్దతు లభిస్తోంది. మరి.. ముఖ్యంగా సినీతారలు పలువురు.. బాలీవుడ్ కు చెందిన ప్రముఖులు ఆయన పాదయాత్రకు హాజరుకావటమే కాదు.. ఆయనతో పాటు కాస్తంత నడిచి తమకున్న అభిమానాన్ని ప్రదర్శిస్తున్నారు.

హైదరాబాద్ లో సాగిన రాహుల్ గాంధీ పాదయాత్రలో వివాదాస్పద నటి పూనమ్ కౌర్ పాల్గొంది. ఈమె ఇప్పటికే ఎన్నో చేష్టలతో తెలుగు నాట వైరల్ అయ్యింది. ప్రజా సమస్యలు, సినీ ఇండస్ట్రీలోని పలు లొసుగులను ఎత్తి చూపి వివాదాలు కొని తెచ్చుకుంది. అప్పట్లో ఒక స్టార్ హీరోతో ఈ భామ పెట్టుకొని పెంట పెంట చేసుకుంది. కొందరు ఇప్పటికీ ఈమెను బేస్ చేసుకొని ఆ హీరోను విమర్శిస్తుంటారు. ఇటీవల కేటీఆర్ కు మద్దతుగా.. ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగానూ గళం ఎత్తింది. తాజాగా 'చేనేతలకు ' మద్దతు అంటూ చేనేత చీర కట్టి రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొంది.

ఇక స్వరాభాస్కర్ ది మరింత వివాదాస్పద నేపథ్యం. బాలీవుడ్ నటి స్వరా భాస్కర్  నోరు వివాదాలకు కేరాఫ్ అడ్రస్. అప్పట్లో ఎవరికి భయపడక తన మదిలోని మాటను బాహాటంగా చెప్పినందుకు స్వరా భాస్కర్ తో పలు సంస్థలు కాంట్రాక్టులు రద్దు చేశారట..తన వాక్ స్వాతంత్ర్యాన్ని వాడుకున్నందుకు శిక్షింపబడాల్సి వచ్చిందట..  కొన్నాళ్ల క్రితం మోడీప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏ, ఎన్ఆర్సీ చట్టాల గురించి ప్రస్తావిస్తూ స్వరాభాస్కర్ తన ఆవేదన వ్యక్తం చేసింది.

ఆ రెండు చట్టాలకు వ్యతిరేకంగా నా ఒపినీయన్ తెలియజేసినందుకు నాకు తగిన శాస్తి జరిగిందని స్వర భాస్కర్ బాధపడింది.  ఆ వ్యాఖ్యల తర్వాత స్వరతో చాలా కమర్షియల్ బ్రాండ్స్ కాంట్రాక్టులు రద్దు చేసుకొని షాక్ ఇచ్చాయి. ప్రభుత్వం తెచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా స్వర నిరసనల్లో పాల్గొంటూ తమ ప్రొడక్టులకు చెడ్డ పేరు తెస్తోందని ఆయా బ్రాండ్స్ వారు తమ కాంట్రాక్టులను రద్దు చేసుకున్నారట..ఈ క్రమంలోనే మోడీ వ్యతిరేకి అయిన రాహుల్ గాంధీతో స్వరాభాస్కర్ చేతులు కలిపి నడవడం విశేషం.

అయితే రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొన్న ఈ హీరోయిన్లు సినిమాల్లేక ఖాళీగా ఉన్నవారే. పైగా ఔట్ డేటెడ్ హీరోయిన్లు. పెద్ద సినిమాల్లో నటించిన వారు కాదు. నోరు పారేసుకొని వివాదాస్పదమై సినిమాల్లో ఎవ్వరూ ఛాన్స్ ఇవ్వని దుస్థితికి దిగజారారు. ఇక్కడ పూనమ్ కౌర్ అయినా.. అక్కడ స్వరాభాస్కర్ అయినా కూడా సినిమాల్లేక రాజకీయాల బాట పడుతున్నారు. ఈ ఫ్లాప్ హీరోయిన్ల వల్ల కాంగ్రెస్ కు కానీ.. రాహుల్ గాంధీకి కానీ ఎలాంటి లాభం లేదు. వీరు అసలే వివాదాస్పద నటులు. ఇప్పుడు కాంగ్రెస్ తో చేరి మరింతగా వివాదాలు రాజేయడం తప్ప పెద్దగా ఉపయోగం లేదన్నది విమర్శకుల మాట.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News