జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై రాజగురువు శారదా పీఠాధిపతి స్వరూపానందకు కోపమొచ్చింది. బ్రాహ్మణ కార్పొరేషన్ను బీసీ వెల్ఫేర్ శాఖ పరిధిలోకి చేర్చటంపై స్వరూపానంద తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. బ్రాహ్మణ కార్పొరేషన్ను బీసీ వెల్పఏర్ డిపార్టమెంట్ పరిదిలోకి తీసుకెళ్ళటమేంటని ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రభుత్వచర్య తమ పీఠానికి ఏమాత్రం నచ్చలేదని స్పష్టంగా స్వామి చెప్పేశారు. బ్రాహ్మణ సంక్షేమ సంఘంలోని అనేక మంది ప్రముఖులు స్వామీజీని కలిసి సమస్యను వివరించారు.
బీసీ సంక్షేమశాఖలోకి బ్రాహ్మణ కార్పొరేషన్ను కలుపుతు ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను కూడా స్వామీజీకి చూపించారు. దాంతో స్వరూపానంద ముందు ఆశ్చర్యపోయారట. తర్వాత ప్రభుత్వం తీరుపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తంచేశారట. తాను తొందరలోనే జగన్ తో సమావేశమై విషయంపై చర్చలు జరుపుతానని హామీ ఇచ్చారట. బ్రాహ్మణులతో పాటు అగ్రవర్ణాల్లోని పేదలను ఎకనామికల్లీ బ్యాక్ వర్డ్ క్యాస్ట్ (ఈబీసీ) జాబితాలో చేర్చాలని స్వరూపానంద ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పటినుండి శారధా పీఠంతో జగన్ కు మంచి సంబంధాలు ఉన్నాయి. జగన్ కు ఏ చిన్న అవసరం వచ్చినా వెంటనే స్వరూపానందను కలుస్తున్న విషయం అందరు చూస్తున్నదే. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు నాలుగుసార్లు స్వరూపానందను సీఎం కలిసుంటారు. అంటే స్వామీజీపై జగన్ కు అంత నమ్మకముంది. శారధాపీఠంలో ఎలాంటి ధార్మిక కార్యక్రమం జరిగినా జగన్ తప్పక హాజరవుతారు.
వీళ్ళద్దరి మధ్య అంతటి సన్నిహిత సంబంధాలున్నాయి కాబట్టే తాజా సమస్యను కూడా స్వామీజీ ద్వారా జగన్ తో మాట్లాడించాలని బ్రాహ్మణ సంక్షేమ సంఘాల్లోని పెద్దలు అనుకున్నారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ పరిధిలోకి బ్రాహ్మణ కార్పొరేషన్ను చేర్చటంపై అందరు ఆశ్చర్యపోతున్నారు. నిధుల కోసమే అని ప్రభుత్వం చెబుతున్నా ఎవరు నమ్మటంలేదు. నిధుల కోసమే బ్రాహ్మణ కార్పొరేషన్ను బీసీ వెల్ఫేర్ శాఖలోకి చేర్చటం నిజమే అయితే అవే నిధులను నేరుగా బ్రాహ్మణ కార్పొరేషన్ కే మంజూరు చేయవచ్చు. సరే చూద్దాం సమస్యను స్వరూపానంద టేకప్ చేశారు కదా ఏమవుతుందో.