విధినిర్వహణలో లేకపోవడమే కాకుండా బికినీలో విశ్రాంతి తీసుకుంటూ ఉండి ఒక దొంగను అరెస్టు చేసి గతంలో అందరి దృష్టిని ఆకర్షించిన స్వీడన్ పోలీస్ అధికారి మైకేలా కెల్నర్ తాజాగా తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. తన కర్తవ్య నిర్వహణతో కేవలం దేశంలోనే కాకుండా, అంతర్జాతీయంగా ఖ్యాతి గడించారు. 11ఏళ్ళ పాటు సేవలందించిన అనంతరం కెల్నర్ బాధాకరమైన ఈ నిర్ణయం తీసుకున్నారు. స్వీడన్ పోలీసు విభాగానికి ఇది పెద్ద ఎదురు దెబ్బ అని భావిస్తున్నారు.
స్వీడన్ పరిపాలనకు ఇటీవల చేపట్టి పోలీసు విభాగ పునర్వ్యవస్థీకరణను ఆమె తీవ్రంగా నిరసిస్తున్నారు. సిబ్బంది పట్ల సరైన వ్యవహార శైలి లేకపోవడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే కెల్నర్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఇదిచాలా కష్టమైన, బాధాకరమైన నిర్ణయమేనని అన్నారు. వ్యక్తిగత శిక్షకురాలిగా పని చేయాలనే విషయంపై ప్రసుత్తం ఆమె దృష్టి పెట్టారు. స్వీడన్ పోలీసు శాఖ అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. తగినంత మంది సిబ్బంది లేకపోవడం, సరైన వేతనాలు చెల్లించకపోవడం, నేరాల అదుపులో విఫలమవడం వంటి సమస్యలు ఉన్నాయి. ఈ తరుణంలో ఇదొక ఎదురు దెబ్బేనని భావిస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/