కాలం గడిచే కొద్దీ ఒత్తిడి పెంచేయటం.. ఫలితాన్ని ఆశించటం.. కొత్త లక్ష్యాల్ని నిర్దేవించటం మామూలైంది. ప్రభుత్వాలు కొలువు తీరేది ప్రజా సంక్షేమం కోసమే అని చెప్పినా.. మరిన్ని సౌకర్యాల కోసం.. వసతుల కోసమని చెబుతూ పన్నుల బాదుడు మోగించటం మామూలే. పన్నుల వ్యవహారం ఒక్కటే కాదు.. ఉద్యోగుల వసతుల్ని వీలైనంతగా తగ్గించాలన్న ధోరణి కనిపిస్తుంది.
కానీ.. అందుకు భిన్న ధోరణిని ప్రదర్శించింది స్వీడన్ దేశం. ఆ దేశ సర్కారు ఉద్యోగుల పని గంటల్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ దేశంలోని ఆరు లక్షల మందికి పైనే ఉద్యోగుల పని గంటల్ని ఎనిమిది నుంచి ఆరు గంటలకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఎనిమిది గంటల పనితో గుండె జబ్బులకు కారణం అవుతుందన్న సమాచారంతో రెండు గంటల పని వేళల్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో ఉద్యోగుల పనిలో మరింత నాణ్యత పెరిగిందని చెబుతున్నారు. ఎనిమిది గంటల పని వేళలప్పుడు సోషల్ మీడియాను చూస్తూ గడిపేవారని.. పని గంటలు తగ్గించిన తర్వాత సోషల్ మీడియాను చూడటం పూర్తిగా తగ్గిందని చెబుతున్నారు.
అంతేకాదు.. ఆసుపత్రుల్లో సేవలు అందించే నర్సులు సైతం రోగుల పట్ల మరింత ఓర్పుతో..శ్రద్ధగా పని చేస్తున్నట్లు గుర్తించారు. ఏది ఏమైనా.. అధ్యయనం ఆధారంగా ఉద్యోగుల పని గంటల్ని ఇంత భారీగా తగ్గించాలన్న నిర్ణయం తీసుకోవటం పెద్ద పరిణామంగా చెప్పొచ్చు.