రాజకీయాలు సామాన్యుల జీవితాల్ని ఎంతలా ప్రభావితం చేస్తాయన్నదానికి నిదర్శనంగా అమెరికాలోని ట్రంప్ హయాంను చెప్పాలి. ఎక్కడో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టటం ఏమిటి? ఆయన తీసుకున్న నిర్ణయంతో మరెక్కడో భారత్ లో ఉన్న సామాన్యుడి డాలర్ డ్రీమ్స్ కు దెబ్బ పడటం ఏమిటి? ట్రంప్ శకం ముగిసి.. బైడెన్ పవర్లోకి వచ్చిన వేళ.. అమెరికాకు వెళ్లాలన్న ఆశ.. ఆకాంక్షలు తీరే సమయం ఆసన్నమైందని చెప్పాలి. హెచ్ 1బీ వీసాలపై గత ప్రభుత్వం అనుసరించిన విధానాలకు భిన్నంగా తాజా బైడెన్ ప్రభుత్వ నిర్ణయం భారత్ తో సహా పలు దేశాలకు ప్రయోజనకరంగా ఉందని చెప్పాలి.
అమెరికాలో ఉద్యోగాలు చేయాలనుకునే వారికి అవసరమైన హెచ్1బీ వీసాల నమోదు ప్రక్రియకు సంబందించిన కీలక అడుగును వేసింది బైడెన్ సర్కారు. మంగళవారం నుంచి కొత్త హెచ్1బీ వీసాల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మంగళవారం నుంచి మొదలయ్యాయి. 2021-22ఆర్థిక సంవత్సరానికి హెచ్1బీ వీసా నమోదు ప్రక్రియ ఈ నెల 25 వరకు కొనసాగనుంది. ఈ ఏడాది కూడా లాటరీ పద్దతిలో వీసాలు జారీ చేయనున్నారు.
ఇలా వీసాకు ఎంపికైన వారికి మార్చి 31 లోపు సమాచారం అందుతుంది. వీరు మాత్రమే హెచ్1బీ క్యాప్ దరఖాస్తు పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రతి ఏడాది అమెరికాలో విదేశాయులు తమ దేశంలో ఉద్యోగాలు చేసుకునేందుకు అనుమతిని ఇస్తుంది. ఇందులో భాగంగా 65 వేల హెచ్1బీ వీసాల్ని జారీ చేస్తుండగా.. మరో 20వేల హెచ్ బీ వీసాల్ని జారీ చేస్తోంది. ఇలా జారీ చేసే 85వేల వీసాల్లో సుమారు 70 శాతం భారతీయులకే జారీ అవుతున్నట్లు చెబుతారు.
వీసా కోసం ప్రాసెస్ ఎలా ఉంటుందంటే..
- తొలుత ప్రతి అప్లికెంట్ యూఎస్సీఐఎస్ (యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్)లో ఖాతా క్రియేట్ చేసుకోవాలి.
- ప్రతి దరఖాస్తుదారుడు రిజిస్ట్రేషన్ కింద 10 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది.
- ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కు అవసరమైన ప్రాథమిక సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది.
- ఇందులో ఎంపికైన దరఖాస్తులకు మాత్రమే హెచ్ 1బీ క్యాప్ సబ్జెక్ట్ పిటిషన్లు దాఖలు చేసేందుకు అర్హత లభిస్తుంది.