శ్వేతారెడ్డి గుర్తుందా....ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై ఆరోపణలతో ఒక్కసారిగా మీడియా దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత బిగ్‌బాస్ షోలో మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్నాయంటూ సంచలనాలకు తెరలేపారు. బిగ్ బాస్ షో కోసం జరిగే ఎంపికలో మహిళలను లైంగికంగా వేధిస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా గాయత్రి గుప్తాతో కలిసి ఢిల్లీ దాకా వెళ్లి పోరాటం చేశారు. కట్ చేస్తే తాజాగా ఆమె కీలక నిర్ణయం తీసుకున్నారు. కాషాయ కండువా కప్పుకొన్నారు.
పలు టీవీ ఛానల్లలో - అనంతరం యూట్యూబ్ ఛానెళ్లలో ప్రముఖులను ఇంటర్వ్యూలు చేయడం ద్వారా పాపులర్ అయిన జర్నలిస్టు శ్వేతారెడ్డి.. బిగ్ బాస్ షోపై తీవ్ర ఆరోపణలు చేశారు. సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ మాదిరిగా బిగ్ బాస్ షోలోనూ ‘కమిట్ మెంట్స్’ ఉన్నాయని ఆరోపించారు. అక్కడ కూడా బాస్ ను ఇంప్రస్ చేయాల్సి ఉంటుందని అంటున్నారు. ఈ కారణాల వల్లే తాను ఆ షో నుంచి తప్పుకున్నానని చెబుతున్నారు. ఇటీవల పలు మీడియా ఛానెళ్లలో మాట్లాడిన శ్వేత.. తాను బిగ్ బాస్ సీజన్ 3కి ఎంపికైన తీరు - ఎందుకు తప్పుకోవాల్సి వచ్చింది వంటి విషయాలను క్షుణ్ణంగా వివరించారు. ఇలా సంచలన ఆరోపణలు చేసిన శ్వేతారెడ్డి తాజాగా ఆంద్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. తన తండ్రి గజ్జల వాసుదేవరెడ్డితో కలిసి శ్వేతారెడ్డి కాషాయ కండువా కప్పుకొన్నారు.
జర్నలిజం వదిలి కేఏ పాల్ పార్టీలో చేరిన శ్వేతరెడ్డి ఎన్నికల అనంతరం వివాదంతో ఆ పార్టీని వీడిని శ్వేతారెడ్డి....తాజాగా బీజేపీ కండువా కప్పుకొని తన పొలిటికల్ కెరీర్ ను ఏ విధంగా ముందుకు తీసుకుపోతారో? ఆమెకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వనున్నారో వేచి చూడాల్సిందే.