భారత్ లాంటి విలక్షణ దేశంలో దేశ ప్రజలంతా ఒకేలాంటి ఆహారపు అలవాట్లు సాధ్యం కాదు. అందుకు భిన్నంగా కొన్నింటి కారణంగా ఆ దూరం తగ్గిపోతోంది. విభిన్న జాతులు.. ఆహారపు అలవాట్లు ఉన్నప్పటికీ బిర్యానీ పుణ్యమా అని అందరినీ ఏకం చేస్తుందని చెప్పాలి. దేశంలో అత్యధికులు ఇష్టపడే ఆహారంగా బిర్యానీ నిలిచింది. ప్రముఖ పుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ ఏటా నిర్వహించే సర్వే ఈ ఏడాది కూడా చేపట్టింది.
ఇందులో ఆసక్తికర అంశాలెన్నో వెలుగు చూశాయి. దేశ వ్యాప్తంగా తనకున్న 530కి పైగా స్విగ్గీ డెలివరీ కేంద్రాల సమాచారం ఆధారంగా తాజా నివేదికను విడుదల చేశారు. స్టాట్ ఈట్ స్టిక్స్ పేరుతో నిర్వహించే సర్వేలో వెలుగు చూసిన ఆసక్తికర అంశాల్ని చూస్తే..
% ఈ ఏడాది కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండే కీటోజెనిక్ ఆహారాన్ని తీసుకునే వారి సంఖ్య భారీగా పెరిగింది.
% బిర్యానీలలో బోన్ లెస్.. చికెన్ బిర్యానీ.. చికెన్ దమ్ బిర్యానీ.. మటన్ బిర్యానీ.. ఎగ్ బిర్యానీ.. వెజ్ బిర్యానీ.. పన్నీర్ బిర్యానీలకు అత్యధిక డిమాండ్ ఉంది
% ముంబయిలోని చాలో థానో తావా బిర్యానీ అతి తక్కువ ధర. కేవలం రూ.19కే లభిస్తుంది.
% ఫూణేలో లభించే చికెన్ సజక్ తప్ బిర్యానీ రూ.1500 లతో అత్యంత ఖరీదైనది
% ప్రతి నిమిషానికి 95 మంది బిర్యానీ ఆర్డర్ చేస్తున్నారు
% నాన్ వెజ్ లో చికెన్ బిర్యానీ అగ్రస్థానంలో నిలిచింది
% వెజ్ లో మసాలా దోశె.. పన్నీర్ బటర్ మసాలా కర్రీకి డిమాండ్ ఎక్కువ
% గతంతో పోలిస్తే ఈ ఏడాది కేలరీలు తక్కువగా ఉండే కీటోజెనిక్ ఫుడ్ కు ఆర్డర్లు మూడు రెట్లు పెరిగాయి
% ఆరోగ్యకరమైన ఆహార ఆర్డర్లు 306 శాతం పెరిగాయి
% ఇంటి వద్ద తయారుచేసే ఆహారానికీ ఆదరణ పెరుగుతోంది. ఈ ఏడాది పప్పు–బియ్యంతో తయారు చేసే కిచిడీ ఆర్డర్లలో 128 శాతం వృద్ధి నమోదయ్యింది.
% అదే సమయంలో రాజ్మా చావల్, పెరుగు అన్నం వంటి వాటికి కూడా డిమాండ్ పెరిగింది.
% తీపి పదార్థాలు, శీతల పానీయాల విషయానికి వస్తే.. అత్యధిక ఆర్డర్లతో గులాబ్‌జామ్ దూసుకుపోతోంది.
% శీతల పానీయాల్లో ఫలూదాకు ఒక్కసారిగా ఈ స్థాయిలో డిమాండ్ పెరిగిందట.
% కేకుల్లో బ్లాక్ ఫారెస్ట్ 3 లక్షల ఆర్డర్లతో మొదటి స్థానంలో నిలిచింది. డెత్ బై చాక్లెట్, టెండర్ కోకోనట్ ఐస్ క్రీం - తిరమిసూ ఐస్ క్రీం - కేసరి హల్వాలను కూడా అత్యధికంగా ఇష్టపడుతున్నారట.
% ఫిబ్రవరి 17 జాతీయ గులాబ్‌జామ్ డే, మే 12 కాఫీ డే - జూన్ 16 ఫ్రెంచ్ ఫ్రైస్ - సెప్టెంబర్ 22 పిజ్జా - అక్టోబర్ 20 బిర్యానీ - టీ డేలుగా ప్రకటించారు.