స్విస్ బ్యాంక్ .. మన దేశంలోని స్టేట్ బ్యాంక్ లో అయిన అకౌంట్ లేని రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు ఇప్పుడు ఉన్నారేమో కానీ , స్విస్ బ్యాంక్ లో మాత్రం కచ్చితంగా అకౌంట్ కలిగివున్నారు. స్విస్ బ్యాంకుల్లో అక్రమంగా సొమ్మును దాచుకున్న వ్యక్తుల్లో ప్రధానంగా రియల్ ఎస్టేట్, ఆర్థిక సర్వీసులు, టెక్నాలజీ, హోమ్ డెకరేషన్, టెక్స్ టైల్స్, ఇంజనీరింగ్ గూడ్స్, జెమ్స్ అండ్ జువెలరీ, టెలికం, పెయింట్స్ రంగాలకు చెందిన వారున్నారు. మన ప్రభుత్వానికి పన్ను కట్టకుండా ఉండటానికి ..అక్రమంగా సంపాదించిన సొమ్ముని మొత్తం స్విస్ బ్యాంక్ లో దాచేస్తున్నారు.
ఇప్పటివరకు రాజకీయ ప్రముఖులు , పారిశ్రామిక వేత్తలే స్విస్ లో తమ సంపదని దాచిపెట్టారు అని అనుకుంటుంటే.. తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది. మన దేశానికి చెందిన రాజ కుటుంబాలు కూడా స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో పెద్ద ఎత్తున కూడబెట్టాయి అని తెలుస్తోంది. కానీ, భారత్-స్విట్జరాండ్ మధ్య కుదిరిన సమాచార మార్పిడి ఒప్పందంతో ఇప్పుడు వీరి బండారం మొత్తం బయటపడుతోంది. 2014లో మోదీ సర్కారు బాధ్యతలు చేపట్టిన తర్వాత స్విస్ బ్యాంకుల్లో అక్రమంగా సొమ్ము దాచుకున్న వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తూ వస్తోంది. దీనికోసం ఆర్థిక నేరాలకు పాల్పడిన వారి వివరాలు, సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు స్విస్ ప్రభుత్వంతో భారత్ ఒప్పందం కూడా చేసుకొంది.
ఇందులో భాగంగానే .. స్విస్ ప్రభుత్వం బ్యాంకు ఖాతాలకు సంబంధించిన వివరాలను వెల్లడి చేయాలని లేనిపక్షంలో భారత ప్రభుత్వంతో ఆ వివరాలను పంచుకుంటామని స్విస్ ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే ఇప్పటికే కొంతమంది పేర్లని కూడా భారత ప్రభుత్వానికి అందజేసింది. ఇక తాజాగా మహారాష్ట్రలోని సాంగ్లీ రాజ కుటుంబానికీ స్విస్ బ్యాంకుల్లో రహస్య ఖాతా ఉన్నట్టు బయటపడింది. దీంతో ఈ ఖాతా పూర్తి వివరాలు చెప్పాలని భారత ఐటీ అధికారులు, స్విట్జర్లాండ్ అధికారుల్ని కోరారు.
ఈ నేపథ్యం లోనే సాంగ్లీ రాజ దంపతులు విజయ్ సింగ్ మాధవరావు పట్వర్ధన్, ఆయన భార్య రోహిణి విజయ్‌సింగ్ పట్వర్థన్ పేరు మీద ఈ ఖాతా ఉన్నట్టు సమాచారం. దీనితో మీ ఖాతా సమాచారాన్ని భారత అధికారులకు తెలిపేందుకు అభ్యంతరాలు ఉంటే 10 రోజుల్లో నామినీలను నియమించి వారి ద్వారా తెలియజేయండి’ అని స్విట్జరాండ్ ఫెడరల్ టాక్స్ అడ్మినిస్ట్రేషన్ పట్వర్థన్ దంపతులకు నోటీసులు జారీ చేసింది. ఇకపోతే హిందీ సూపర్ హిట్ సినిమా ‘మైనే ప్యార్ కియా’ హీరోయిన్ భాగ్యశ్రీ పట్వర్థన్ దంపతుల కుమార్తె. సాంగ్లీ రాజ కుటుంబం ఇప్పటి వరకు దీనిపై నోరు విప్పలేదు.