గుట్టుగా సంపాదించి గుట్టలుగుట్టలుగా పేరుకుపోయిన నల్లధనాన్ని గుట్టు చప్పుడు కాకుండా విదేశాలకు తరలించే బడాబాబుల టైం ఏమాత్రం బాగున్నట్లు లేదు. మొన్నటి వరకూ విదేశాల్లో దాచుకున్న నల్లధనం గురించి భారత ప్రభుత్వాలు సమాచారం అడిగితే.. లైట్ తీసుకునే దేశాలు సైతం ఇప్పుడు స్పందిస్తున్నాయి. పదిహేను రోజుల క్రితం నల్లధనానికి చెక్ చెబుతూ.. దేశంలో చెల్లుబాటులో ఉన్న పెద్దనోట్లను ఒక్కమాటతో చెల్లకుండా చేసి పారేసిన ప్రధాని మోడీ నిర్ణయం పుణ్యమా అని ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయో తెలిసిందే.
మోడీ ఇచ్చిన షాక్ తో కోలుకోలేని నల్లకుబేరులకు మరో కష్టం వచ్చి పడినట్లే. విదేశాల్లో పోగుబడిన నల్లధనం వివరాలు.. దానికి సంబంధించిన వారి సమాచారాన్ని అందించేందుకు ఏ మాత్రం సానుకూలంగా ఉండని స్విట్జర్లాండ్ తాజాగా అందుకు భిన్నమైన స్వరాన్ని వినిపించింది. మరో ఏడాదిన్నర తర్వాత అంటే.. 2018 నుంచి ఆ దేశంలో దాచి ఉంచే నల్లధనం వివరాల్ని ఎప్పటికప్పుడు అందజేసేందుకు ఓకే చెప్పింది.
అంటే.. 2018 ముందు వరకు తమ వద్ద ఉన్న సమాచారాన్ని స్విట్జర్లాండ్ బయటకు చెప్పదు. ఆ తర్వాత నుంచి మాత్రం.. అంటే.. రమారమిగా 2019 నుంచి ఆ దేశంలో ఎవరైనా నల్లధనాన్ని దాచుకునే ప్రయత్నం చేస్తే.. ఆ వివరాల్ని మనదేశానికి అందజేస్తుంది. దీనికి సంబంధించి ఇరుదేశాలకు చెందిన ఉన్నతాధికారులు ఢిల్లీలో సంతకాలు చేశారు. దేశంలో పోగేసిన నల్లధనాన్ని హవాలా మార్గంలో విదేశాలకు తరలించి.. నల్లధనానికి ఎలాంటి ఆంక్షలు లేని స్విస్ లో డబ్బు దాచుకోవటం ఎప్పటి నుంచో ఉన్నదే. తాజాగా మోడీ సర్కారు తీసుకుంటున్ననిర్ణయాలతో పాటు.. పలు దేశాలపై పెంచిన ఒత్తిడితో ఇలాంటి ఒప్పందాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/