ప్రధాని మోడీ ఎన్నికల హామీ నెరవేరుస్తాడా లేదా అన్నది ఇప్పుడు తేలనుంది. గెలిస్తే స్విస్ బ్యాంకుల్లో భారతీయ కుబేరులు దాచిన నల్లడబ్బును భారత్ కు తెస్తారని.. వాటిని పేదల అకౌంట్లలో వేస్తానని మోడీ హామీ ఇచ్చారు. ఇప్పటికే మోడీసార్ పాలన ఆరేళ్లు దాటింది. కేంద్ర ప్రభుత్వం నల్లడబ్బు తెచ్చే ప్రయత్నాలు నెరవేరాయి.
తాజాగా స్విట్జర్లాండ్ దేశం భారత్ కు చెందిన పౌరులు, సంస్థల రెండో స్విస్ బ్యాంక్ అకౌంట్ల వివరాలను అందించింది. 31 లక్షల ఆర్థిక ఖాతాల వివరాల గురించి 86 దేశాలతో పంచుకున్నట్లు స్విట్లర్లాండ్ వెల్లడించింది. ప్రపంచ ప్రమాణాల చట్రంలో భాగంగా మార్పిడి చేసిన 86 దేశాలలో భారతదేశం కూడా ఒకటి.
ఈ సంవత్సరం స్విస్ అధికారులు 100 మందికి పైగా భారతీయ పౌరులు, సంస్థల గురించి సమాచారాన్ని పంచుకున్నారని భారత అధికారులు తెలిపారు. ఈ కేసులు ఎక్కువగా పాత ఖాతాలకు సంబంధించనవి. 2018కి ముందుగా మూసివేసినట్లుగా తెలుస్తోంది. ఈ కేసుల్లో పనామా, బ్రిటీష్ వర్జిన్ ఐలాండ్స్, కేమాన్ దీవుల్లో స్థాపించిన భారతీయ సంస్థలకు సంబంధించినవి ఉన్నాయి.
ఈ ఖాతాల్లో ఎక్కువగా వ్యాపారులు, కొంతమంది రాజకీయ నాయకులు మరియు తరువాత రాయల్స్ , కుటుంబ సభ్యులు ఇందులో అకౌంట్లను కలిగి ఉన్నట్టు తేలింది.స్విస్ బ్యాంకు ఖాతాల వివరాలు మోడీ సర్కార్ వాటిని రికవరీ చేస్తుందా? డబ్బులను సీజ్ చేస్తుందా? వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందా అన్నది ఆసక్తిగా మారింది.