ఉన్నత చదువులు చదవి.. చక్కటి ఉద్యోగం చేస్తూ దారుణ నేరాలకు పాల్పడే వారికి సంబంధించి హైదరాబాద్ లో తాజాగా వెలుగుచూసిన ఉదంతం సంచలనం సృష్టిస్తోంది. ఇతగాడి శాడిస్ట్ ప్రేమను చూస్తే దడుచుకోవాల్సిందే. ప్రేమించి.. పెళ్లి చేసుకోమ్మని బలవంతం చేయటమే కాదు.. కిడ్నాప్ చేసి.. చంపేస్తానంటూ బెదిరించి.. అత్యాచారంతో పాటు.. ఇంట్లో బంధించిన వైనం చూస్తే విస్మయం చెందాల్సిందే. షాక్ తినిపించే ఈ వ్యవహరంలో చూస్తే.. ఉత్తరప్రదేశ్ లోని అలీఘర్ కు చెందిన 26 ఏళ్ల సయ్యద్ ఇమాద్ హసన్ మాదాపూర్ లోని ఒక ఐటీ కంపెనీలో పని చేస్తున్నాడు. టౌలీచౌకీలోలోని అల్ హస్ నత్ కాలనీలో ఇతడు ఉంటున్నాడు.
అదే కంపెనీలో పని చేసే ఒక తెలుగమ్మాయి (కర్ణాటకలో సెటిల్ అయ్యారు)తో పరిచయం అయ్యింది. అది కాస్త ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలని ప్రపోజ్ చేశాడు. అదే సమయంలో ఆ అమ్మాయికి ఉద్యోగ రీత్యా దుబాయ్ కి వెళ్లాల్సి వచ్చింది. అక్కడకు వెళ్లిన తర్వాత నుంచి ఆమెకు టార్చర్ మొదలైంది. తనతో పెళ్లికి ఓకే చేయాలని లేదంటే.. ఆమెకు సంబంధించిన ఫోటోలు యూట్యూబ్ లో పెడతానని బెదిరించేవాడు. పెళ్లి చేసుకుందామంటూ దుబాయ్ నుంచి టిక్కెట్లు బుక్ చేయటంతో ఆ అమ్మాయి ఆరు రోజల క్రితం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి వచ్చింది.
ఆమెను తన ఇంటికి తీసుకెళ్లి బంధించి.. అయితే పెళ్లి చేసుకోవాలని.. లేదంటే చచ్చిపోవాలంటూ అతడు టార్చర్ పెట్టటం మొదలు పెట్టాడు. ఆమెపై అత్యాచారం జరిపాడు. ఆమె ఫోన్ స్విచ్ఛాప్ చేసి.. ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ చేసిన అతగాడు.. ఆ అమ్మాయికి నరకం చూపించాడు. తాడు.. కత్తి.. పెట్రోల్.. ఈ మూడు ఆప్షన్లలో ఏదో ఒకదానిని ఎంచుకోవాలని.. దాంతో చావటమో.. లేదంటే పెళ్లి చేసుకోవటమో ఏదో ఒకటి డిసైడ్ చేసుకోవాలని ఒత్తిడి చేయటం మొదలు పెట్టాడు.
సయ్యద్ ఇంట్లో లేనప్పుడు అతి కష్టమ్మీదా తన పరిస్థితిని స్నేహితురాలికి వివరించి.. ఇంటికి సమాచారం అందివ్వాలని ప్రాదేయ పడటం.. కర్ణాటకలోని సోదరుడికి సమాచారం అందటంతో అతను హైదరాబాద్ కు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయటంతో షి టీం సాయంతో ఆమెను రక్షించి.. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఇక.. బాధితురాలి వెర్షన్ ప్రకారం.. అతనితో తనకు పెళ్లి ఇష్టం లేదని చెప్పేందుకే దుబాయ్ నుంచి వచ్చినట్లుగా చెప్పినట్లు తెలిసింది. . ప్రేమించే ముందు.. ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ప్రేమలో పడిన తర్వాత నచ్చకపోతే.. ఆ విషయాన్ని ఇబ్బందులు రాకుండా జాగ్రత్తగా చెప్పటంతో పాటు.. ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఉంది.