ఈ లక్షణాలు మీలో ఉంటే కరోనా వైరస్‌ మీలో ఉన్నట్లే!

Update: 2020-03-29 14:30 GMT
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ ను ఒకరికి తెలియకుండా ఒకరు అంటించుకుంటూ ఉన్నారు. తమకు కరోనా వైరస్‌ సోకిందనే విషయం తెలిసేప్పటికి వారు చాలా మందికి అంటిస్తున్నారు. అలా ప్రపంచ వ్యాప్తంగా ఆ సంఖ్య విపరీతంగా పెరుగుతూనే ఉంది. దాదాపుగా ఏడు లక్షల మందికి కరోనా వైరస్‌ సోకింది. మృతుల సంఖ్య కూడా భయాందోళన కలిగిస్తుంది.

కరోనా వైరస్‌ మన శరీరంలోకి చేరిన రెండు వారాల తర్వాత పూర్తిగా పాజిటివ్‌ గా నిర్ధారణ అవుతుంది. కాని అంతకు ముందే మన శరీరంలో వచ్చే మార్పులతో మనలో ఆ మహమ్మారి ఉందా లేదా అనే విషయాన్ని గుర్తించవచ్చు అంటూ వైధ్యులు చెబుతున్నారు.

కరోనా వైరస్‌ మనలో చేరిన రోజు నుండే మార్పు అనేది కనిపిస్తుంది. ఆ విషయాలను కాస్త జాగ్రత్తగా గుర్తిస్తే ఇతరులకు ఆ వైరస్‌ ను ఇతరులకు అంటించకుండా జాగ్రత్త పడవచ్చు.

కరోనా వైరస్‌ సోకిన వారు ఏ రోజులో ఎలాంటి ఇబ్బందులు పడుతారో ఇప్పుడు చూద్దాం :

1వ రోజు : వికారంగా ఉండటం జ్వరం రావడం జరగొచ్చు
2వ రోజు : వికారం జ్వరంకు తోడు అలసట ఇంకా ఒల్లునొప్పులు పొడి దగ్గు వస్తాయి
3వ రోజు : అస్సలు ఓపిక ఉండక పోవడంతో పాటు పొడి దగ్గు ఎక్కువ అవ్వడం ఒళ్లు నొప్పులు పెరగడం జరుగుతుంది.
4వ రోజు : పై సమస్యలు మరింతగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి.
5వ రోజు : పై సమస్యలు మరింతగా పెరగడంతో పాటు ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా మారుతుంది.
6వ రోజు : ఊపిరి తీసుకోవడం మరింత ఇబ్బందిగా మారి ఆయాసం అవుతుంది
7వ రోజు : ఈ సమయంలో హాస్పిటల్‌ లో జాయిన్‌ కాకుంటే ఊపిరి తిత్తులు చెడిపోయే ప్రమాదం ఉంది.
8వ రోజు : చికిత్స ఇంకా కూడా అందుకోకుంటే ఊపిరితిత్తులు మరింతగా చెడిపోయి మృతి చెందే ప్రమాదం ఉంది.
9వ రోజు : ఆరోగ్యం మరింత క్షీణించడంతో పాటు నిలబడేందుకు కూడా ఓపిక ఉండదు. ఊపిరి తీసుకోవడం ఇబ్బంది పడతారు. వెంటిలేటర్‌ పెట్టాల్సి వస్తుంది.
10వ రోజు : పేషంట్‌ పూర్తిగా ఢీలా పడిపోతాడు. ఈసమయంలో చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది.
11వ రోజు ఇప్పటికి అయినా హాస్పిటల్‌ లో జాయిన్‌ అయితే రెండు లేదా మూడు వారాల్లో పేషెంట్‌ రోగ నిరోదక శక్తి ఇంకా వయసు బట్టి కరోనా నుండి విముక్తి పొందవచ్చు.

మొదటి వారం రోజుల్లోనే కరోనా వైరస్‌ లక్షణాలు మీరు గుర్తించి ఐసోలేషన్‌ లోకి వెళ్లాలి. సరైన సమయంలో చికిత్స పొందడం వల్ల తీవ్రమైన పరిస్థితులకు లోనవ్వకుండానే కరోనా నుండి బయట పడవచ్చు.

అందుకే ప్రతి ఒక్కరు కూడా ఇంట్లోనే ఉండటం ఎవరికైనా ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఎవరికి వారు ఐసోలేషన్‌ అవ్వడం మంచిది. అత్యవసరాలకు మాత్రమే బయటకు వెళ్లాలి. ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించి దేశాన్ని కరోనా నుండి కాపాడుకుందాం.


Tags:    

Similar News