తెలంగాణ ముఖ్యమంత్రి తెలివితేటల గురించి ఎవరికీ సందేహాం అక్కర్లేదు. సందర్భానుసారం ఏది వర్కవుట్ అవుతుందో బాగా పసిగట్టగల నేతల్లో ఆయన ముందుంటారు. ఈ క్రమంలోనే రంజాన్ పండగ సందర్భంగా ముస్లింలను ఖుష్ చేసేందుకు ప్రయత్నం చేశారు. రూ.27 కోట్లు వెచ్చించి ముస్లింలకు బిర్యానీ విందు, బట్టలు పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ప్రభుత్వం తరఫున అధికారికంగా ఈ కార్యాక్రమం చేపట్టడం ఇదే మొదటిసారి.
దీంతో మిగతా అన్ని పార్టీల్లోనూ ఒక్కసారిగా ఈ విషయం చర్చనీయాంశం అయింది. కేసీఆర్ ముందుకు వెళుతున్న విషయాన్ని గమనించినప్పటికీ ఆయన్ను ఫాలో అవుతున్నట్లుగా అవుతుందనుకున్నారో ఏమో కానీ ఇఫ్తార్ విందు ఏర్పాటుకు దూరంగా ఉండిపోయారు. అయితే కాంగ్రెస్ మాత్రం తనదైన శైలిలో ముందడుగు వేసింది.
ముస్లింలకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇఫ్తార్ విందు ఇచ్చింది. నాంపల్లి హజ్‌హౌస్ సమీపంలో జరిగిన ఈ విందుకు ఏఐసీసీ నేత సల్మాన్ ఖుర్షీద్ ముఖ్యఅతిథిగా కేంద్ర మాజీ మంత్రి ఎస్ జైపాల్‌రెడ్డి, ఏఐసీసీ నాయకులు సందీప్ దీక్షిత్, మధుయాష్కీగౌడ్, రామచంద్ర కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత కె జానారెడ్డి, మండలి ప్రతిపక్ష నేత మహ్మద్ షబ్బీర్‌అలీ, కేంద్ర మాజీమంత్రి బలరాంనాయక్, ఎంపీలు వీ హన్మంతరావు, రాపోలు ఆనందభాస్కర్, సీపీఐ మాజీ ఎంపీ అజీజ్‌పాషా, తదితరులు హాజరయ్యారు.
మొత్తంగా మైనార్టీ సోదరులే కాకుండా జాతీయ నాయకులతో కలిసి ఇఫ్తార్ విందు ఏర్పాటుచేయడం ద్వారా తామెంత ముందు ఉన్నామో చెప్పకనే చెప్పినట్లయింది.