తెలంగాణలో రాజకీయం అంతకంతకూ వేడుక్కుతోంది. ఎవరూ తగ్గని పరిస్థితి. ఏ చిన్న అవకాశం వచ్చినా వదిలిపెట్టకుండా విరుచుకుపడుతున్న వైనం ఇప్పుడు రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ అధికారపక్షం వర్సెస్ కేంద్ర ప్రభుత్వం మధ్య ఇప్పటికే మాటల యుద్ధం ముదిరిపోవటం తెలిసిందే. ఢిల్లీలో తేల్చుకుంటామని వెళ్లిన మంత్రుల టీం.. వారానికి పైగా అక్కడే ఉండటం.. తాము చెప్పినట్లుగా తేల్చుకోలేకపోయిన టీఆర్ఎస్ నేతలు.. చివరకు క్రిస్మస్ కు ఒక రోజు ముందు తెలంగాణకు తిరిగి వచ్చేశారు.
ఏదేదో చేస్తామన్న మాటలతో దేశ రాజధానికి పయనమైన గులాబీ మంత్రులు.. కేంద్రం తీరు తెలంగాణ ప్రజల్ని అవమానించేలా ఉందన్న వాదనను తీసుకొచ్చారు. దాన్ని తిప్పికొట్టే ప్రయత్నంలో తెలంగాణ బీజేపీ నేతలు బిజీ అయ్యారు. ఇలా టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య నడుస్తున్న రచ్చలో తమ పాత్ర లేకపోవటం.. హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ఊపు తగ్గిందన్న మాట తరచూ వినిపిస్తున్న వేళ.. ఆ వాదనలో నిజం లేదన్న విషయాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ నేతల మీద పడింది.
ఢిల్లీ వేదికగా జరుగుతున్న లొల్లిలోకి తనదైన శైలిలో ఎంట్రీ ఇచ్చారు తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఢిల్లీలో తేల్చుకుంటామని వెళ్లిన టీఆర్ఎస్ మంత్రులు.. అందుకు భిన్నంగా ఉత్త చేతులతో వస్తే మాత్రం ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ అలా వస్తే మాత్రం మంత్రులకు చీరలు.. గాజులు పంపుతామని చెప్పారు. ఏమీ సాధించకుండానే ఉత్త చేతులతో వచ్చిన గులాబీ మంత్రులకు.. తాము చెప్పినట్లే చీరలు.. గాజులతో వదిలి పెట్టకుండా పసుపు.. కుంకుమ.. బొట్టు బిళ్లలను పంపిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
పార్లమెంటు సమావేశాల వేళ.. ఢిల్లీలోనే ఉన్న మంత్రులు ఏమీ చేయలేకపోయారని.. ఎంపీలు సైతం పార్లమెంటులో తమ వాణిని సమర్థంగా వినిపించలేదన్న విమర్శ చేస్తున్నరు కాంగ్రెస్ నేతలు. చేతకాని రాష్ట్ర మంత్రులు తమ పదవులకు రాజీనామా చేసి.. చీర.. గాజులు వేసుకొని ఇంట్లోకూర్చోవాలని తెలంగాణ కాంగ్రెస్ మహిళా నేతలు మండిపడుతున్నారు. మొత్తానికి తాము చెప్పే మాట ఏదీ కూడా మాట వరసకు కాకుండా.. చేతల్లో చేసి చూపిస్తామన్నట్లుగా చీరలు.. గాజులు పంపటంతో స్పష్టం చేశారు. మరి.. ఈ ఎపిసోడ్ పై తెలంగాణ మంత్రులు ఏ తీరులో రియాక్టు అవుతారో చూడాలి.