ఒకసారి ఛీ కొట్టించుకుంటే సరిపోదు.. అదే పనిగా ఛీ కొట్టించుకుంటే కానీ తృప్తిగా ఉండదన్నట్లుగా ఉంది ఏపీ టీడీపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ వైఖరి చూస్తుంటే. ఏపీ చేసిన అన్యాయానికి ప్రతిగా రాష్ట్ర విభజన జరగాల్సిందేనంటూ కోట్లాది మరీ తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర అధినేత.. ఏపీ కోసం పోరాడాలన్న పిలుపు ఇవ్వటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
అందరి మాదిరి కాకుండా తనదైన శైలిలో మాట్లాడి చిరాకు తెప్పించటంలో మొనగాడైన టీజీ ఎలాంటోడో తెలుగోళ్లందరికి బాగా తెలుసు. విభజన ఉద్యమం పీక్స్ లో నడుస్తున్న వేళ..అందుకు వ్యతిరేకంగా ఏపీలో సమైక్య ఉద్యమాన్ని మహిళలు.. ఉద్యోగులు.. వ్యాపారులు రోడ్ల మీదకు వస్తుంటే.. టీజీ మాత్రం ఫ్యామిలీతో కలిసి ఫారిన్ ట్రిప్ కు వెళ్లటాన్ని మర్చిపోకూడదు. అప్పటివరకూ కాంగ్రెస్ జెండా కింద బండి నడిపిన టీజీ.. విభజన లెక్కల నేపథ్యంలో టీడీపీలో చేరిపోయారు.
విభజన ఉద్యమ సమయంలో తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే టీజీ.. విభజన సమయంలో ఏపీకి నష్టం జరగకుండా చూసే విషయాన్ని అస్సలు పట్టించుకోలేదన్న ఆరోపణ ఉంది. ఉద్యమంపై తరచూ నోరు పారేసుకోవటం ద్వారా ఆంధ్రోళ్ల మీద తెలంగాణ ప్రాంత ప్రజలకు మరింత చికాకు తెప్పించిన టీజీ.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంత వాసులకు న్యాయం జరిగేలా ఏ రోజు ప్రయత్నించలేదన్నది మర్చిపోకూడదు.
సార్వత్రిక ఎన్నికల్లో టీజీని కర్నూలు ప్రజలు తిరస్కరించటం.. యాక్టివ్ రాజకీయాలకు దూరంగా తన వ్యాపారాల్లో నిమగ్నమైన ఆయనకు.. బాబు రాజ్యసభ సీటు ఇచ్చిన వైనం తెలిసిందే. ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పే టీజీ.. ఏ రోజు తనకున్న పలుకుబడిని ప్రజల కోసం ఉపయోగించిన దాఖలాలు లేవన్న విమర్శ ఉంది.
గడిచిన కొద్ది కాలంగా తన దారిన తాను అన్నట్లుగా ఉండే ఆయన.. తాజాగా చేసిన వ్యాఖ్యలు చూస్తే ఒళ్లు మండక మానదు. విభజన తర్వాత తమ మానాన తాము బతికేస్తున్న హైదరాబాద్ లోని సీమాంధ్రులను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని చెప్పాలి. ఏపీ చేస్తున్న ప్రత్యేక హోదా పోరాటంలో టీఆర్ ఎస్ అధినేత.. తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేసీఆర్ సైతం పోరాడాలని.. చంద్రబాబుతో చేతులు కలిపి ఫైట్ చేయాలని పిలుపునిస్తున్నారు.
ఒకవేళ.. తమ బాబుతో కానీ చేతులు కలపకపోతే కేసీఆర్ ఇబ్బంది పడతారని హెచ్చరిస్తున్నారు. అదెలా అంటారా?. హైదరాబాద్ లోని సీమాంధ్రులు కేసీఆర్ కు వ్యతిరేకంగా ఓటు వేస్తారంటూ వ్యాఖ్యానిస్తున్నారు. విభజన తర్వాత హైదరాబాద్ లోని సీమాంధ్రులు పడిన టెన్షన్ అంతా ఇంతా కాదు. తెలంగాణ ప్రాంతీయులు సోదరభావంతో తమతో కలిపేసుకోవటం.. ఉద్యమ నేత అయినప్పటికీ సీమాంధ్రుల్ని చిన్నచూపు చూసేలా జరిగే ప్రయత్నాల్ని నీరుగార్చటంలో కేసీఆర్ కీలక భూమిక పోషించారు.
ఇలాంటి వేళ.. బాబు ప్రయోజనాలు కాపాడటం కోసం కేసీఆర్ కలిసిరావాలని లేకుండా సీమాంధ్రులు ఆయన్ను ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తారని చెప్పటం శోచనీయంగా చెప్పాలి. కర్ణాటకలోని తెలుగు వారి మాదిరే తెలంగాణలోని సీమాంధ్రులు కేసీఆర్ కు వ్యతిరేకంగా ఓటు వేస్తారని చెప్పుకొచ్చారు.టీజీ తీరు చూస్తుంటే.. హైదరాబాద్ లోని సీమాంధ్రులకు ఇబ్బంది కలిగేలా కేసీఆర్ ను కెలుకుతున్నారన్న భావన వ్యక్తమవుతోంది.
తాను.. తన వ్యాపారాలు.. తన పదవి మాత్రమే ముఖ్యమనుకునే టీజీ లాంటోడు అంతవరకే పరిమితం కావటం మంచిది. అలా కాకుండా అధినేతకు మేలు చేయాలనే అత్యుత్సాహంతో లక్షలాదిగా హైదరాబాద్ లో ఉన్న సీమాంధ్రులకు ఇబ్బంది కలిగేలా వ్యవహరించటం ఏ మాత్రం సరికాదు. ముందు చూపు లేకుండా బాబు చూపు మాత్రమే టీజీకి ఉన్న నేపథ్యంలో.. సీమాంధ్రులకు ఇబ్బంది కలిగేలా ఉండే ఆయన మాటల్ని కట్ చేయాలి. లేదంటే.. ఆ తరహా వ్యాఖ్యలు చేయకుండా నోటికి పరిమితుల ప్లాస్టర్ వేయటం మంచిది. లేదంటే.. విభజన తర్వాత నుంచి హైదరాబాద్ లో ఉన్న సహృద్భావ వాతావరణం అంతో ఇంతో మిస్ అయ్యే అవకాశం ఉంది. కర్నూలు పట్టణంలో రాజభవనం లాంటి నివాసంలో ఉండే టీజీకి హైదరాబాద్‌లోని సామాన్యుల బతుకులకుంటే ఇబ్బందులు తెలిసే అవకాశం తక్కువ. అలాంటోళ్ల మాటలు లేనిపోని తిప్పలు తెచ్చి పెడతాయన్నది మర్చిపోకూడదు.