100 పర్సంట్ మార్కులొస్తే సమంత చీరలు

Update: 2017-12-03 08:25 GMT
తెలంగాణ రాష్ట్రంలో చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికైన సమంత.. చాలా సిన్సియర్ గా దానికి సంబంధించిన బాధ్యతల్ని నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే. చేనేత కార్మికులు తయారు చేసే గొల్లభామ చీరలకు సమంత విస్తృత ప్రచారం కల్పిస్తోంది. ఆ చీరలు ఇప్పటికే బాగా ఫేమస్ అయ్యాయి.

తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో మంచి ఫలితాలు రాబట్టే ఉపాధ్యాయులకు ఇప్పుడు ఈ చీరల్నే బహుమతిగా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుండటం విశేషం. ప్రభుత్వ పాఠశాలలు పదో తరగతిలో 100 శాతం ఫలితాలు రాబట్టే పాఠశాలలకు చేనేత గొల్లభామ చీరలు బహుమతిగా అందజేస్తామని తెలంగాణ మంత్రి హరీష్ రావు ప్రకటించారు.

అలాగే పదో తరగతి ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో అగ్ర భాగాన నిలిచే ప్రభుత్వ పాఠశాలలకు రూ.లక్ష చొప్పున నగదు బహుమతి కూడా అందజేస్తామన్నారు. తన నియోజకవర్గమైన సిద్ధిపేట ప్రాంతంలో టాప్-10 పాఠశాలలకు రూ.10,116 చొప్పున నగదు బహుమతులు ఇవ్వనున్నట్లు కూడా హరీష్ తెలిపారు. మరి సమంత చీరల కోసం.. నగదు బహుమతుల కోసం పాఠశాలలు ఎంత పట్టుదలతో పని చేస్తాయో చూడాలి.
Tags:    

Similar News