ఆ మధ్యన రాత్రివేళ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చెందిన టీ న్యూస్ ఛానల్‌కు ఏపీ పోలీసులు నోటీసులు ఇవ్వటం తెలిసిందే. అందుకు 48 గంటల సమయం ఇచ్చిన విషయం అప్పట్లోనే వెల్లడైంది. మరి.. ఏపీ సర్కారు ఇచ్చిన నోటీసులకు సదరు టీ న్యూస్ ఛానల్ స్పందించిందా? అన్నది ఒక ప్రశ్న అయితే.. టీ న్యూస్ ఛానల్‌కు చేతికి నోటీసులు ఇచ్చిన ఏపీ పోలీసులు.. సాక్షి టీవీ ఛానల్‌కు పోస్ట్‌లో నోటీసులు పంపినట్లుగా చెప్పారు.
తాజాగా అధికారుల మధ్య జరుగుతున్న చర్చల సారాంశాన్ని గుది గుచ్చితే లభించే సమాచారం ఏమిటంటే.. ఏపీ సర్కారు ఇచ్చిన నోటీసులకు టీ న్యూస్ ఛానల్‌తో సహా సాక్షి ఛానల్ కూడా ఎలాంటి రిప్లై ఇవ్వలేదని చెబుతున్నారు.
తామిచ్చిన నోటీసుల్లో పేర్కొన్న గడుపు పూర్తి అయినప్పటికీ.. వారి నుంచి ఎలాంటి సమాధానం రాని నేపథ్యంలో ఏం చేయాలన్న అంశంపై ఏపీ పోలీసులు దృష్టి సారిస్తున్నారు. మళ్లీ మరోసారి నోటీసులు ఇవ్వాలా? లేక తమ నోటీసులకు సమాధానం ఇవ్వని నేపథ్యంలో కోర్టు దృష్టికి తీసుకెళ్లి నేరుగా చర్యలు తీసుకోవాలా? అన్న అంశంపై పోలీసు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మరో రెండు.. మూడు రోజుల్లో ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. తాము ఇచ్చిన నోటీసులకు టీ న్యూస్.. సాక్షి నుంచి ఎలాంటి స్పందన లేకపోవటంపై పోలీసులు అధికారులు అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు.