న‌డ‌వ‌లేక కుప్ప‌కూలిపోయిన సుబ్బిరామిరెడ్డి

Update: 2015-07-24 09:54 GMT
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తాజాగా చేప‌ట్టిన పాద‌యాత్రలో ఊహించ‌ని ప‌రిణామం చోటు చేసుకుంది. రైతు భ‌రోసా యాత్ర నిర్వ‌హించిన రాహుల్‌ గాంధీతో పాటు న‌డిచేందుకు ప‌లువురు ఏపీ కాంగ్రెస్ నేత‌లు ఉత్సాహంగా ముందుకొచ్చారు.

అయితే.. ఇప్ప‌టికే ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తో ఉన్న కొంద‌రు నేత‌లు.. యువ‌రాజు మ‌న‌సులో స్థానం సంపాదించుకోవాల‌న్న ఉద్దేశ్యంతో రాహుల్‌తో క‌లిసి అడుగువేసే ప్ర‌య‌త్నం చేశారు.

ఇలా రాహుల్‌ తో క‌లిసి న‌డిచిన వారిలో కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌.. పారిశ్రామిక‌వేత్త సుబ్బిరామిరెడ్డి ఒక‌రు. ఇప్ప‌టికే వెన్నునొప్పితో బాధ ప‌డుతున్న ఆయ‌న‌.. రాహుల్ తో క‌లిసి కొద్ది దూరం న‌డిచిన వెంట‌నే తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. వెన్నునొప్పి భ‌రించ‌లేక‌.. న‌డుస్తూనే ఆయ‌న కుప్ప‌కూలిపోయారు. దీంతో.. వెనువెంట‌నే స్పందించిన సిబ్బంది ఆయ‌న్ను అంబులెన్స్ లో పుట్ట‌ప‌ర్తి కి త‌ర‌లించారు. ఆరోగ్య స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్న నేత‌లు.. త‌మ శ‌క్తికి మించిన ప‌నులు చేసే క‌న్నా.. విష‌యాన్ని వివ‌రంగా చెప్పి వెన‌క్కి త‌గ్గి ఉంటే బాగుంటుంది.
Tags:    

Similar News