టీ20 వరల్డ్ కప్: పాకిస్తాన్ సెమీస్ చేరడం కష్టమే.. డిప్రెషన్ లో బాబర్ అజాం
టీ20 ప్రపంచకప్ 2022లో సంచలనాలు నమోదవుతున్నాయి. పసికూనలు.. బలమైన జట్లను మట్టి కరిపిస్తున్నాయి. మొన్న బలమైన ఇంగ్లండ్ ను ఐర్లాండ్ మట్టి కరిపించగా.. నిన్న పాకిస్తాన్ ను జింబాబ్వే ఓడించింది. టాప్ జట్లను సెమీస్ చేరకుండా మధ్యలో వర్షం అంతరాయం కలిగించి ఆ జట్ల అవకాశాలను దెబ్బతీస్తోంది.
టైటిల్ హాట్ ఫేవరేట్ లుగా నిలిచిన జట్లు ఓడిపోతుండడం విశేషం. అటు ఆస్ట్రేలియా తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ చేతుల్లో ఓడడం.. ఇటు పాకిస్తాన్ ను జింబాబ్వే ఓడించడంతో సమీకరణాలు మొత్తం మారిపోతున్నాయి. పాయింట్ల పట్టిక తలకిందులవుతోంది.
పాకిస్తాన్ కు జింబాబ్వే ఇచ్చిన షాక్ తో మన గ్రూపులో పాకిస్తాన్ అవకాశాలకు భారీగా గండిపడింది. పాకిస్తాన్ సెమీస్ చేరాలంటే అద్భుతం జరగాలి. దాదాపు దాని అవకాశాలు మూసుకుపోయినట్టే. భారత్, దక్షిణాఫ్రికాలే ఆ చాన్స్ ఉంది.
పాకిస్తాన్ సెమీస్ చేరాలంటే ఖచ్చితంగా దక్షిణాఫ్రికాను భారత్ జట్టు ఓడించాలి. అదే సమయంలో పాకిస్తాన్ మిగిలిన అన్ని జట్లను.. దక్షిణాఫ్రికాతో అన్నింటిపై గెలవాలి. ఇదంతా జరిగితేనే పాక్ జట్టు సెమీస్ చేరుతుంది. లేదంటే ఇంటిదారి పడుతుంది.
ఈ పరిస్థితుల్లో తదుపరి మ్యాచ్ ను ఈనెల 30న పాకిస్తాన్ జట్టు పెర్చ్ వేదికగా నెదర్లాండ్ తో ఆడబోతోంది. బాబర్ అజామ్ సారథ్యంలోని పాకిస్తాన్ జట్టు వరుసగా రెండు పరాజయాల తర్వాత మూడో మ్యాచ్ ఆడబోతున్న నేపథ్యంలో అందరి దృష్టి ఆ జట్టుపైనే ఉంది.
ఇక తాజాగా బాబర్ అజాం మాట్లాడుతూ సెమీఫైనల్స్ కు వెళ్లలేమని.. అది కష్టసాధ్యమని తేల్చిచెప్పాడు. ఈ విషయాన్ని నిజాయితీగా చెబుతున్నానని పేర్కొన్నాడు. సెమీస్ చేరే అవకాశాలు లేవని స్పష్టం చేశాడు. టోర్నమెంట్ లో ముందడుగు వేయడానికి తీవ్రంగా శ్రమించాల్సి ఉందని.. దాని కోసం కష్టపడుతున్నామని.. వరుస ఓటములు తమను నిరాశకు గురిచేశాయని తాను అంగీకరిస్తున్నానని బాబర్ తెలిపారు.
నిన్న పాకిస్తాన్ పై కేవలం ఒక పరుగు తేడాతో జింబాబ్వే సంచలన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 8 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. అయితే పాకిస్తాన్ బ్యాట్స్ మెన్ ఈ తక్కువ లక్ష్యాన్ని సాధించలేక 129 పరుగులకే పరిమితమయ్యారు. భారత్ పై ఓడి.. ఇప్పుడు జింబాబ్వేపై ఓడి సెమీస్ అవకాశాలను పాకిస్తాన్ క్లిష్టం చేసుకుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.