ఆస్ట్రేలియాలో తొలిసారి టి20 ప్రపంచకప్.. వేదికలేవంటే..

Update: 2021-11-16 14:30 GMT
ప్రపంచంలో ఏ దేశంలో క్రికెట్ మ్యాచ్ లు జరుగుతుండగా చూడడం బాగుంటుంది...? ఎక్కడ మైదానాలు బాగుంటాయి..? ఎక్కడ అభిమానులు హద్దు మీరకుండా ఉంటారు...? ఎక్కడ క్రికెట్ ఆడడాన్ని ఆటగాళ్లు ఆస్వాదిస్తారు..? బుద్ధి బలంతోడు భుజ బలాన్ని ప్రదర్శించేందుకు.. ఎక్కడ బ్యాట్స్ మన్ కు బౌలర్లకు సమానంగా అవకాశాలుంటాయి? వీటన్నిటికీ సమాధానం ఆస్ట్రేలియా. అందమైన పెద్ద పెద్ద మైదానాలు.. వాటలో పూర్తిగా పచ్చిక.. జీవం ఉట్టిపుడుతూ కళకళలాడే పిచ్ లు.. అహో.. ఒకటా, రెండా? ఆస్ట్రేలియా మైదానాల గురించి చెప్పాలంటే మాటలు చాలవు. అందుకే ఆ దేశంలో క్రికెట్ ఆడడాన్ని క్రికెటర్లు, చూడడాన్ని అభిమానులు అత్యంత ఇష్టపడతారు.

‘‘తెల్లవారుజాము’’ అనుబంధం

ఇప్పడంటే డే నైట్ వన్డేలు.. టి20 మ్యాచ్ లు వచ్చాయి. రెండు దశాబ్దాలు వెనక్కు వెళ్తే ఆస్ట్రేలియాతో మ్యాచ్ లంటే భారత కాలమానంలో తెల్లవారు జామున ప్రారంభమయ్యేవి. వీటిని చూసేందుకు వీరాభిమానులు నిద్ర మానుకునేవారు. వేడి వేడిగా టీ, కాఫీలు పెట్టుకుని టెస్టులు, వన్డేలు చూసేవారు. అదో రకమైన అనుభూతి. నిజం చెప్పాలంటే అవన్నీ మళ్లీ మళ్లీ చూడాలనిపించే మ్యాచ్ లు.. సిడ్నీలో సచిన్ చెలరేగడం.. మెల్బోర్న్లో లక్ష్మన్ విధ్వంసం.. ఆడిలైడ్ లో ద్రవిడ్ బ్యాటింగ్ విన్యాసాలు.. ఇలా అనేక అనుభూతులు.

తొలి సారి కంగారూ వేదికపై

ఇప్పటివరకు ఏడుసార్లు టి20 ప్రపంచకప్ లు జరిగాయి. 2007లో దక్షిణాఫ్రికా, 2009లో ఇంగ్లాండ్, 2010లో వెస్టిండీస్, 2012లో శ్రీలకం, 2014లో బంగ్లాదేశ్, 2016లో భారత్ ఆతిథ్యం ఇచ్చాయి. ఇందులో ఆతిథ్యం పరంగా మిగిలింది ఆస్ట్రేలియా, పాకిస్థాన్, న్యూజిలాండ్ మాత్రమే. పాక్ లో అసలు ద్వైపాక్షిక సిరీస్ లే జరిగే పరిస్థితి లేదు. ఇక టి20 ప్రపంచ కప్ గురించి ఆలోచించే పరిస్థితి లేదు. న్యూజిలాండ్ చిన్న దేశం. మిగిలింది ఆస్ట్రేలియా. అతి పెద్ద దేశం, క్రికెట్ లోనూ పెద్ద జట్టయిన ఈ దేశంలో ఇప్పటివరకు టి20 ప్రపంచ కప్ జరగకపోవడం కొంత విచిత్రమే. అయితే, ఆ లోటును తీర్చేలా 2020 అక్టోబరులో కంగారూ గడ్డపై టి20 విశ్వ కప్ జరుగనుంది.

సొంత గడ్డపై ఛాంపియన్ గా

ఇటీవలి టి20 ప్రపంచకప్ ను గెలుచుకున్న ఆస్ట్రేలియా సొంత గడ్డపై వచ్చే ఏడాది జరుగనున్న కప్ కు డిఫెండింగ్ చాంపియన్ గా అడుగుపెట్టబోతున్నది. తొలిసారి టి20 విశ్వ విజేతగా నిలిచిన కంగారూలు.. ఆ హోదాను ఏడాది పాటు మాత్రమే అవకాశం దక్కడం కొంత చిత్రమే. అయితే, ఈ సారి కప్ జరుగబోయేది సొంతగడ్డపై కాబట్టి దానిని నిలుపుకొనే అవకాశాలూ వారికి బాగానే ఉన్నాయి.

ఇవీ ఆతిథ్య నగరాలు..

2020 టి 20 ప్రపంచ కప్ ఆస్ట్రేలియాలోని మొత్తం ఏడు నగరాల్లో జరుగనుంది. అక్టోబరు 16 నుంచి నవంబరు 13 వరకు జరిగే 45 మ్యాచ్ లు జరుగుతాయి. మనందరికీ తెలిసిన ఆడిలైడ్, సిడ్నీ, పెర్త్, బ్రిస్బేన్, మెల్బోర్న్, హోబర్ట్ తో పాటు గీలాంగ్ అనే నగరంలోనూ కొత్తగా మ్యాచ్ లు జరుగనున్నాయి. మెల్బోర్న్లో ఫైనల్, సిడ్నీ, ఆడిలైడ్ లో సెమీ ఫైనల్స్ జరుగనున్నాయి. అభిమానులకు గీలాంగ్ నగరం కొత్తదే. ఇది ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రంలో ఉన్న పోర్ట్ సిటీ.
Tags:    

Similar News