తైవాన్ మంత్రి ప్రసంగాన్ని ఆపేశారు.. చైనాకు భయపడిన అమెరికా

Update: 2021-12-13 16:40 GMT
అమెరికా నిర్వహించిన ప్రజాస్వామ్య సదస్సు-2021లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఈ సదస్సుకు చైనాను కాకుండా తైవాన్ ను ఆహ్వానించి బైడెన్ సర్కార్ సంచలనం సృష్టించింది. కానీ తైవాన్ మంత్రి ప్రసంగిస్తుండగా.. చైనాకు భయపడి అర్థాంతరంగా  ఆ వీడియోను కట్ చేసింది. చివరకు మాకేమీ సంబంధం లేదంటూ ఓ ప్రకటన కూడా వెలువరించింది. ఈ విషయాన్ని అమెరికా స్థానిక పత్రికలు బయటపెట్టాయి.

ప్రజాస్వామ్య సదస్సులో తైవాన్ తరుఫున మంత్రి ఆడ్రీ టాంగ్ పాల్గొని వీడియో సందేశం ఇచ్చారు. ఈ సమయంలో ఆమె ప్రదర్శించిన ఒక మ్యాప్ ను చూసి శ్వేతసౌధం అధికారులు ఆందోళనకు గురయ్యారు. ఆ మ్యాప్ లో చైనా, తైవాన్ లు వేర్వేరు రంగుల్లో ఉన్నాయి. దీంతో ఇది అమెరికా 'వన్ చైనా పాలసీ'కి విరుద్ధమంటూ వెంటనే ఆమె ప్రసంగం వీడియో లైవ్ ను నిలిపివేశారు. ఆ మ్యాప్ ను తొలగించాలని కోరారు. ఈ గందరగోళంలో తైవాన్ మంత్రి ప్రసంగం వీడియో మొత్తం పోయింది. కేవలం ఆడియో మాత్రమే వినిపించింది.

అనంతరం అమెరికా ఒక ప్రకటన విడుదల చేసింది. 'ఈ కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తులు వెల్లడించిన అభిప్రాయాలు వారి సొంతం. అమెరికా అభిప్రాయాలను ఏమాత్రం ప్రతిబించవు' అని దానిలో పేర్కొంది.

తైవాన్ మంత్రి టాంగ్ చూపిన మ్యాప్ ను దక్షిణిఫ్రికాకు చెందిన 'సివికస్' అనే ఎన్.జీవో తయారు చేసింది. దీనిలో ప్రపంచవ్యాప్తంగా స్వేచ్ఛా, మానవ హక్కులకు సంబంధించిన ర్యాలకులను ఇచ్చింది. ఇవి చైనా తైవాన్ ను వేర్వేరు రంగుల్లో చూపిస్తున్నాయి. ఈ మ్యాప్ లో తైవాన్ ఆకుపచ్చ రంగులో ఉండగా.. చైనా, ఉత్తరకొరియా, వియత్నంలు ఎరుపురంగులో ఉన్నాయి.
Tags:    

Similar News