తిట్టటం అన్నది రాజకీయాల్లో చాలా చాలా చిన్న విషయం. సైద్ధాంతిక వైరుధ్యాలతో వాదులాడుకునే స్థాయి నుంచి వ్యక్తిగతంగా బండ బూతులు తిట్టుకోవటమే కాదు.. అత్యంత అమర్యాదగా మాట్లాడుకోవటం ఈ మధ్యన రాజకీయాల్లో చాలా కామన్ అయ్యింది.
ఇక.. రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న పంచాయితీల విషయంలో ఇరు ప్రాంతాలకు చెందిన అధికారపక్ష నేతల మధ్య నడుస్తున్న మాటల యుద్ధం అంతా ఇంతా కాదు.
అయితే.. ఏపీ.. తెలంగాణ మంత్రులు.. అధికారపక్ష నేతలు ఎవరు ఎంతగా విమర్శలు చేసినా.. తెలంగాణ రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్.. పోచారం శ్రీనివాస్‌రెడ్డిలు తిట్టినంతగా మరెవరూ తిట్టరు. వారు నోరు తెరిచి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును టార్గెట్ చేశారంటే.. తీవ్రస్థాయిలో విరుచుకుపడతారు. ఒక ముఖ్యమంత్రి మరో రాష్ట్ర మంత్రి ఇలా కూడా మాట్లాడతారా? అన్న సందేహం కలిగేలా వారు దుయ్యబడతారు.
అయితే.. ఈ ఇద్దరు నేతలు ఒకప్పుడు చంద్రబాబుకు అత్యంత సన్నిహితులుగా మెలగటం విశేషం. పార్టీలో వీరికి పెద్ద పీట వేయటంతో పాటు.. వారికి రాజకీయంగా చంద్రబాబు ఎన్నో అవకాశాలు ఇవ్వటం కనిపిస్తుంది. అలాంటి ఈ నేతలిద్దరూ ఇప్పుడు చేస్తున్న వ్యాఖ్యలు చూసిన వారు ముక్కున వేలేసుకుంటున్నారు.
రాజకీయాల్లో శాశ్విత మిత్రత్వం.. శత్రుత్వం ఉందన్న మాట నిజమే అయినాప్పటికీ.. మరీ ఇంత దారుణంగా మాత్రం తిట్టి పోయటం కనిపించదు. తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు ఎంతమంది పార్టీ మారినా.. తలసాని.. పోచారం స్థాయిలో మాత్రం ఎవరూ తిట్టని పరిస్థితి. మొత్తానికి మాజీ బాస్‌ను మాటలతో ఆటాడుకోవటంలో ఈ ఇద్దరు తెలంగాణ మంత్రులు ముందు ఉండటం విశేషమే.