సంక్రాంతి రోజులు దగ్గర పడే కొద్దీ కోడి పందాల రాజకీయం వేడెక్కుతోంది. గోదావరి జిల్లాల సంప్రదాయమైన కోడి పందాలకు అడ్డుకట్ట వేయాలంటూ ఓ వైపు కోర్టులను ఆశ్రయిస్తుంటే పందాలే తమ ప్రచారానికి, ఓట్ల వేటకు అనువైన సందర్భం అంటూ రాజకీయ నాయకులు అడుగులు వేస్తున్నారు. తెలంగాణలో పాపులర్ పొలిటీషన్ అయిన తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇపుడు ఈ కోడి పందాల ఆట ఆధారంగా తన రాజకీయ రాయభారం నడపనున్నారని తెలుస్తోంది.
తాజాగా టీఆర్ ఎస్ యువనేత-మంత్రి కేటీఆర్ తమ పార్టీని తెలుగు రాష్ర్ట సమితిగా మారుస్తామని... అపుడు తను ఆంధ్రాలో కూడా పోటీ చేస్తానని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అంతేకాదు కోడిపందాలకు ఫేమస్ అయిన బీమవరం నుంచి తాను ఎన్నికల బరిలో ఉంటానని కేటీఆర్ వ్యాఖ్యానించారు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో... తానేదో సరదాగా అన్నానని కేటీఆర్ తర్వాత కవర్ చేసుకున్నారు. అయితే ఇదే పాయింట్ ను పట్టుకొని కేటీఆర్ టీం మెంబర్(!) అయిన తలసాని ఓట్ల వేట షురూ చేశారు.
ఈ సంక్రాంతికి తలసాని బీమవరం వెళ్లనున్నారట. కోడిపందాలు చూసేందుకు తాను ఈ దఫా బీమవరం వెళ్తున్నానని తలసాని తన సన్నిహితులతో చెప్పారు. ప్రతి ఏటా తన సంక్రాంతి పండుగను ఆంధ్రాలోని మిత్రుల మధ్య జరుపుకొంటానని చెప్పిన తలసాని ఈ దఫా బీమవరాన్ని ఎంచుకున్నారట. తలసాని ఆనవాయితి బాగానే ఉన్నా...గతంలో ఆయన వెళ్లింది టీడీపీ నేతగా. ఈ దపా టీఆర్ ఎస్ తరఫున ఆయన కోడిపందాల కోసం బీమవరం వెళ్లేది మాత్రం సెటిలర్ల ఓట్లపై కన్నేసి, వాటిని గులాబీ గూటిలో వేసుకునేందుకేనని అంటున్నారు.