జీరో బిజినెస్ అన్న మాట చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అది కూడా వ్యాపార కుటుంబాలకు మాత్రమే సుపరిచితమైన పదం. అలాంటి మాటను ఇప్పుడు బహుళ ప్రచారంలోకి తీసుకొస్తున్న ఘనత తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కే దక్కుతుంది.
ఇంతకీ జీరో బిజినెస్ అంటే ఏమీ లేదు.. ప్రభుత్వానికి పన్నులు కట్టకుండా వ్యాపారం చేయటం. ఇంకా స్పష్టంగా.. అర్థమయ్యేలా చెప్పాలంటే నల్ల వ్యాపారం. బ్లాక్‌మార్కెట్ అని చెప్పగానే చాలామంది హడలిపోయే ప్రమాదం ఉంది. కానీ.. ఈ వ్యాపారం చాలా సింఫుల్‌గా సాగుతుంటుంది. దీనికి కారణం భారీగా ఉండే పన్నుల పుణ్యమేనని వ్యాపార వర్గాలుచెబుతుంటాయి.
ఉదాహరణకు ఒక బంగారుషాపు.. తాను చేసే వ్యాపారం మొత్తాన్ని ప్రభుత్వానికి చెబితే.. అది చెల్లించాల్సిన పన్ను దెబ్బకు వ్యాపారం మూసేయాల్సిన పరిస్థితి ఉంటుంది. లేదంటే.. భారీగా ధరలు పెంచాల్సి ఉంటుంది. ధర పెంచితే బిజినెస్ పడిపోతుంది. బిజినెస్ నడపాలంటే జీరో బిజినెస్ చేయాల్సిందే. అంటే తాను లక్ష రూపాయిల సరుకు అమ్మితే.. ప్రభుత్వానికి అధికారికంగా చూపించేది పదివేలు మాత్రమే ఉంటుంది. అదే సమయంలో సదరు వ్యాపారి లక్ష రూపాయిలు అమ్మితే.. కనీసం రూ.95వేలకు అయినా కొనుగోలు చేసిన విషయాన్ని చూపించాలి కదా? అది కూడా చూపించరు. ఇలా ఎవరికి వారు తాము చేసే వ్యాపారాలకు సంబంధించి కచ్ఛితమైన లెక్కలు చూపించరు.
చూపిస్తే ఏమవుతుందంటే.. భారీగా వాణిజ్యపన్ను కట్టాల్సి ఉంటుంది. దాంతో సరిపోదు.. ఇన్ని కోట్లకు బిజినెస్ చేశావు కాబట్టి.. నీకు వచ్చే ఆదాయం ఈ రేంజ్లో ఉంటుందంటూ ఐటీ కూడా భారీగా కట్టాల్సి ఉంటుంది.
ఇదంతా ప్రాక్టికల్ గా సాధ్యం కాదు కాబట్టే.. చేసే వ్యాపారాన్ని చెప్పకుండా జీరో బిజినెస్ చేసేస్తుంటారు వ్యాపారులు. తాజాగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అలాంటి వ్యాపారం మీద దృష్టి సారిస్తానని చెబుతున్నారు. ఆసుపత్రులు.. హోటళ్లు.. బంగారు దుకాణాలు ఇలా ఏ వ్యాపార సంస్థ కూడా పన్నులు చెల్లించటం లేదని.. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. సుదీర్ఘకాలంగా సాగుతున్న జీరో వ్యాపారాన్ని కుదుళ్లతో సహా పెకిలించి వేస్తే.. మరే ఇతర పన్నులు లేకుండానే రాష్ట్ర బడ్జెట్ ను నడిపించేయొచ్చని చెబుతుంటారునిపుణులు. మరి.. ఈవిషయంలో తలసాని ఎంతమేర విజయవంతం అవుతారో చూడాలి.చూస్తూ.. చూస్తూ తమ వ్యాపారాలను తీవ్రస్థాయిలో ప్రభావితం చేసే దీనిపై వ్యాపార వర్గాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.