ఆఫ్ఘనిస్దాన్ను తాలిబన్లు ఆక్రమించేసుకోవటంతో పిచ్చ హ్యాపీగా ఉన్న దేశాలు చైనా, పాకిస్ధాన్ ముందుంటాయి. తర్వాత వరసలో రష్యా కూడా సంతోషంగానే ఉంది. అయితే మూడు దేశాల సంతోషంలో దేనికారణం దానికుంది. రష్యాకేమో అమెరికా సైన్యం ఆఫ్ఘనిస్ధాన్ నుండి వెళిపోతోందనే సంతోషం. కానీ పాకిస్ధాన్, డ్రాగన్ దేశాలకు మాత్రం భారత్ పైకి తాలిబన్లను ఉసిగొల్పటానికి ప్రత్యక్షంగానో లేకపోతే పరోక్షంగానో అవకాశం దొరుకుతుందని తెగ సంతోషిస్తున్నాయి.
అయితే ఈ రెండు దేశాలకు తాలిబన్ల మద్దతు ఎల్లకాలం ఉంటుంది అని అనకునేందుకు లేదు. ఎందుకంటే తాలిబన్లతో వ్యవహారం పాముకు పాలుపోయటం లాంటిదే అని ఇప్పటికే అనేకసార్లు రుజువైంది. నిజానికి తాలిబన్ల ఆవిర్భావం జరిగిందే పాకిస్ధాన్ లో. దీన్ని ముందు రష్యా ఆ తర్వాత అమెరికా వీళ్ళని బాగా పెంచిపోషించాయి. ఇక మొదటినుండి తాలిబన్లకు పాకిస్ధాన్ ప్రత్యక్ష, పరోక్ష సహకారం అందిస్తునే ఉంది. రష్యాతో తాలిబన్ల వ్యవహారం చెడిందని అనుకోగానే వెంటనే అమెరికా రంగంలోకి దిగేసింది.
రష్యాకు వ్యతిరేకంగా అమెరికా తాలిబన్లకు ఆయుధాలను, కోట్ల కొద్ది నిధులను సమకూర్చింది. తర్వాత ఇదే తాలిబన్లు అమెరికాకు ఎదురుతిరిగారు. అప్పటివరకు అమెరికా అందించిన ఆయుధాలు, నిధుల సాయంతో అమెరికా మీద తిరగబడ్డారు. ఇదే సమయంలో మొదటినుండి సాయంగా నిలుస్తున్న పాకిస్ధాన్ పైన కూడా తాలిబన్లు తిరగబడ్డారు. తమ అస్తిత్వానికి ఎదురుతిరుగుతారని అనుకున్న, తమ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారని అనుమానం వచ్చిన ఎవరిమీదైనా సరే తాలిబన్లు తిరగబడతారు.
ఇపుడు పాకిస్ధాన్, చైనాలు మద్దతుగా నిలిచినంత మాత్రాన ఏదోరోజు వీళ్ళకు తాలిబన్లు ఎదురు తిరగరని అనుకునేందుకు లేదు. తమతో పెట్టుకుంటే ఎవరైనా మటాషే అనే విషయాన్ని తాలిబన్లు గతంలో చాలాసార్లు నిరూపించారు. ఎందుకంటే పోవటానికి తాలిబన్ల దగ్గర ఏమీలేదు. అదే ఏదేశంపైనైనా పగబట్టారంటే తాలిబన్లే ఏదో రూపంలో చొరబడి మారణహోమాన్ని మొదలుపెడతారు. వీళ్ళని ఏరేయటానికి ఆ దేశాలే నానా తంటాలు పడాలి.
కాబట్టి చరిత్రను బాగా గుర్తుపెట్టుకుని ముందుజాగ్రత్తగా తాలిబన్లతో కేంద్రం దౌత్య పరమైన సంబంధాలను అంటీముట్టనట్లుగా వ్యవహరించాల్సిందే. అమెరికా తాలిబన్లను వ్యతిరేకిస్తోంది కాబట్టి మనం కూడా వ్యతిరేకించాలని అనుకుంటే భవిష్యత్తులో సమస్యలు తప్పవు. ఈరోజు కాకపోయినా ఏదోరోజు పాకిస్ధాన్, చైనాలు తాలిబన్లను కంట్రోల్ చేయాలని చూడకమానవు. అప్పుడు తాలిబన్లే చింతబరికలు పట్టుకుని వీళ్ళ వెంటపడతారు. ఆరోజు కోసం ఓపిగ్గా వెయిట్ చేయాల్సిందే తప్పదు.