తాలిబన్ వ్యవస్థాపకుడి కారు.. 21 ఏళ్ల తర్వాత

Update: 2022-07-08 14:30 GMT
అమెరికాపై 9/11 దాడుల సూత్రధారి అయిన తాలిబన్ వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్ వాడిన ఓ కారును 21 ఏళ్ల తర్వాత భూమిలో నుంచి తాలిబన్లు బయటకు తీశారు. అమెరికా దాడుల నుంచి ఈ కారులోంచే ముల్లా ఒమర్ తప్పించుకోవడం గమనార్హం.  ఒమర్ వాడిన ఇదే కారును కనిపించకుండా దాచేశారు.  21 ఏళ్ల  తర్వాత దాన్ని భూమిలోనుంచి బయటకు తీశారు.

తాలిబన్ వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్ కు గుర్తుగా 2001లో అప్ఘనిస్థాన్ లోని జాబుల్ ప్రావిన్స్ లోని ఓ గ్రామం సమీపంలోని తోటలో పాతిపెట్టారు. ఇప్పుడు ముల్లా ఒమర్ ఉపయోగించిన ఈ తెల్లరంగు టయోటా కరోలా కారును తాలిబన్లు బయటకు తీయడం హాట్ టాపిక్ గా మారింది.

ముల్లా ఒమర్ అప్ఘనిస్తాన్ లోని 'కాందహార్' నగరంలో 'తాలిబన్'ను స్థాపించాడు. కొన్ని సంవత్సరాల పాటు దేవంలో అంతర్యుద్ధం చేశాడు. చివరకు 1998 నాటికి అప్ఘనిస్తాన్ దేశంలోని చాలా ప్రాంతాలను తాలిబన్లు ఆక్రమించారు. ఇస్లామిక్ పాలన పేరుతో అప్ఘనిస్తాన్ లో కఠినమైన నిబంధనలు అమలు చేసి లెక్కలేనని అరాచకాలను తాలిబన్లు ఆ దేశంలో సృష్టించారు.

అమెరికాపై 9/11 దాడులు చేసిన ఒసామా బిన్ లాడెన్ కు తాలిబన్లు ఆశ్రయం ఇచ్చారు. లాడెన్ ను అప్పగించాలని అమెరికా కోరినా అప్పట్లో తాలిబన్లు నిరాకరించారు. దీంతో తాలిబన్ల మీద.. అప్ఘనిస్తాన్ పైనా అమెరికా దాడి చేసింది. 2001 అక్టోబర్ నుంచి అమెరికా, నాటో దళాలు కలిసి వైమానిక దాడులు చేశాయి. దీంతో తాలిబన్ వ్యవస్థాపకుడు టయోటా కరోనా కారులో తప్పించుకొని పారిపోయి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.

2001లోనే తాలిబన్ నాయకుడు అబ్దుల్ జబ్బార్ ఒమారీ సమక్షంలో అప్ఘనిస్తాన్ లోని జాబుల్ ప్రావిన్స్ లోని ఓ గ్రామం సమీపంలోని తోటలో ఈ కారును పాతిపెట్టారు. తాజాగా ఈ పాతిపెట్టిన కారును తాలిబన్లు బయటకు తీశారు. ఫొటోలు,వ ీడియోలు విడుదల చేశారు. ముల్లాకు గుర్తుగా ఈ కారును మ్యూజియంలో పెట్టడానికి నిర్ణయించారు.

అమెరికా దాడితో అజ్ఞాతంలోకి వెళ్లిన ముల్లా ఓమర్ 2013 వరకూ జీవించినట్టు సమాచారం. తర్వాత ఆయన చనిపోయినా కూడా తాలిబన్లు ఈ విషయాన్ని బయట ప్రపంచానికి తెలియనీయకుండా దాచిపెట్టారు. ప్రస్తుతం ఆయన కారు 21 ఏళ్ల తర్వాత కూడా చెక్కుచెదరకుండా ఉందని.. కేవలం ముందు భాగం మాత్రమే దెబ్బతిని మిగతా అంతా కండీషన్ గా ఉందని చెబుతున్నారు.
Tags:    

Similar News