ఆఫ్ఘనిస్థాన్ నుండి అమెరికా తమ బలగాలను ఉపసంహరించుకున్న ప్రభావం భారతదేశంలోని జమ్మూకాశ్మీర్ పై కనిపిస్తోందా అంటే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కనిపిస్తుందనే చెప్పాలి. దీనితో భారత్ కు ఇప్పుడు తాలిబన్లు కొత్త సమస్యగా మారబోతున్నారా , తాజాగా కాశ్మీర్ తో సహా ఎక్కడైనా ముస్లింల కోసం తమ స్వరాన్ని పెంచే హక్కు తమకు ఉందని ఉగ్రవాద సంస్థ తాలిబన్ పేర్కొనడం అందుకు ఊతమిస్తోందా అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తుంది. అఫ్గానిస్తాన్ ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు కశ్మీర్, భారత్ లేదా మరో ఇతర దేశంలో ముస్లింల హక్కులపై మాట్లాడి తీరుతామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ముస్లింల సమస్యలపై స్పందించే హక్కు తమ కుందన్నారు. తాలిబన్ల పాలనలో అఫ్గన్ భూభాగం దేశంలో వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగపడుతుందనే ఆందోళనల మధ్య తాజా వ్యాఖ్యలు మరింత కలవరం రేపుతున్నాయి. కశ్మీర్ తోపాటు మరే ఇతర ప్రాంతంలో ఉన్న ముస్లింల స్వరాన్ని వినిపించే హక్కు సాటి ముస్లింలుగా తమకుందని తాలిబన్ అధికార ప్రతినిధి సుహైల్ షహీన్ స్పష్టం చేశారు. ముస్లింలు మీ సొంత ప్రజలు, మీ స్వంత పౌరులని చెబుతాం, మీ చట్టాల ప్రకారం వారికీ సమాన హక్కులుంటాయని చెబుతామని వ్యాఖ్యానించారు. కాబూల్ ను తమ నియంత్రణలోకి తీసుకున్న కొన్ని రోజుల తర్వాత, కాశ్మీర్ ఒక ద్వైపాక్షిక, అంతర్గత విషయమని చెప్పిన దానికి భిన్నంగా తాలిబన్ అధికార ప్రతినిధి తాజా ప్రకటన ఉంది.
మరోవైపు జమ్మూకశ్మీర్ లో పెరుగుతున్న ఆందోళనల మధ్య, ఈ ప్రాంతంలో భారత ప్రభుత్వం ఇప్పటికే నిఘాను పెంచింది. ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్ల అరాచకం కొనసాగుతోంది. ప్రజలు భయం గుప్పిట్లో బ్రతుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అమెరికా దళాల ఉపసంహరణపై అదేదో పెద్ద విజయం సాధించినట్టు తాలిబన్లు సంబరాలు జరుపుకుంటున్నారు. కానీ ఆఫ్ఘనిస్థాన్ లో పరిస్థితులు రోజురోజుకు దయనీయంగా మారుతున్నాయని. రాజకీయ సంక్షోభం, ఆర్థిక సంక్షోభం, ఆహార సంక్షోభాలు ఆఫ్ఘనిస్తాన్ వాసులను పీడిస్తున్నాయి.తాలిబన్ పాలనలో ఆఫ్ఘనిస్థాన్ భూభాగం భారత వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగపడుతుందని భారతదేశం ఇప్పటికే ఆందోళనలో ఉంది. ఈ క్రమంలో తాజాగా కాశ్మీర్ తో సహా ఎక్కడైనా ముస్లింల కోసం తమ స్వరాన్ని పెంచే హక్కు తమకు ఉందని ఉగ్రవాద సంస్థ పేర్కొంది. ఏదేమైనా, ఏ దేశానికీ వ్యతిరేకంగా ఆయుధాలను పెంచే విధానం గ్రూపుకు లేదని చెప్తూనే ముస్లింల కోసం పోరాటం చేస్తామని చెప్పటం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది.
ఇదిలా ఉంటే ఇప్పటికే కాశ్మీర్ అంశంపై ఆల్ ఖైదా తాలిబన్ల సాయం కోరింది. ఆఫ్ఘనిస్థాన్ ఆక్రమణకు సహాయం చేసినందుకు ప్రతిగా కాశ్మీర్ అంశంలో సహాయం చెయ్యాలని ఆల్ ఖైదా కోరింది. కానీ తాలిబన్లు ఏమీ చెప్పకుండా సైలెంట్ గా ఉన్నారు.జమ్మూ కాశ్మీర్‌లో భద్రతా పరిస్థితులపై పెరుగుతున్న ఆందోళనల మధ్య, ఈ ప్రాంతంలో భారతదేశం భద్రతా నిఘాను పెంచింది. కాశ్మీర్ లో భద్రతా నిఘా నేపధ్యంలో ప్రస్తుతం పరిస్థితులు నియంత్రణలో ఉన్నాయి. ఇటీవల, పాకిస్తాన్ అధికారంలో ఉన్న పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ ప్రభుత్వం యొక్క నాయకుడు, తాలిబన్లు భారతదేశానికి కాశ్మీర్‌ను విముక్తి చేయడంలో దేశానికి సహాయం చేస్తారని చెప్పారు. పాక్ నాయకుడు నీలం ఇర్షాద్ షేక్ మాట్లాడుతూ, తాలిబాన్లు మాతో ఉన్నారని చెప్పడం ఆందోళన పుట్టిస్తోంది. అమెరికా ఆధీనంలోని అఫ్గాన్‌కు తాలిబన్ల వల్ల విముక్తి లభించిందని, తదుపరి లక్ష్యం కశ్మీరే అంటూ అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థ ఇటీవల సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే.