ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా తన బలగాలను గతేడాది చివర్లో ఉపసంహరించుకుంది. ఇదే అదనుగా తాలిబన్లు ఆ దేశాన్ని ఆక్రమించుకున్నారు. నాటి ఆప్ఘన్ ప్రభుత్వాన్ని కూలగొట్టి తాలిబన్లు సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో కొన్ని నెలలుగా ఆఫ్ఘనిస్తాన్ లో అరాచక పాలన రాజ్యమేలుతోంది.
తాలిబన్లు పాలన పేరుతో అనేక ఆంక్షలు విధిస్తున్నారు. గత 20 ఏళ్ల కింద తాలిబన్లు ఎలాంటి అరాచక పాలన కొనసాగించారో అదే పాలనకు ప్రస్తుతం శ్రీకారం చుట్టారు. ఆఫ్ఘన్ లోని మహిళలకు స్వేచ్ఛగా తిరిగే హక్కు కూాడా లేకుండా పోయింది. క్రమంగా వారంతా చదువులకు.. ఉద్యోగాలకు దూరమవుతున్నారు.
ఆప్ఘన్లో ఆడ పిల్లలకు ఆరో తరగతి తర్వాత విద్యను నిషేధించారు. మహిళలు ఒంటరి ప్రయాణాలు చేయరాదని.. మీడియా సంస్థల్లో పని చేయకూడదని ఇటీవల హూకుం జారీ చేశారు. ఆ తర్వాత స్త్రీలు బయటకు వెళ్లాలంటే బురఖా.. ఇస్లామిక్ స్కార్ఫ్ తప్పనిసరి ధరించాలని.. జిమ్.. పార్కులకు వెళ్లరాదని ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.
తమ ఆదేశాలను ఎవరైనా ధిక్కరిస్తే కఠినమైన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు ప్రతిరోజు బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు. ఎవరైనా ఎదిరిస్తే నిర్ధాక్షిణ్యంగా కాల్చి వేస్తుండటంతో అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని అక్కడి ప్రజలు జీవిస్తున్నారు.
అఫ్ఘనిస్తాన్లో తిరుగుబాటును పూర్తి చేసిన అణిచివేసిన తాలిబన్లు తమదైన శైలిలో శిక్షలను సైతం అమలు చేస్తున్నారు. తాలిబాన్ పాలనలో తొలిసారి అధికారికంగా బహిరంగ ఉరి శిక్షను తాజాగా అమలు చేశారు. ఈ కార్యక్రమానికి ఆ దేశ ప్రధాన న్యాయమూర్తి.. ఉప ప్రధాని సహా మంత్రులు కూడా హాజరు కావడం గమనార్హం.
2017లో ఓ వ్యక్తిని పొడిచి చంపాడనే కారణంతో నిందితుడికి తాలిబన్లు బహిరంగ ఉరి శిక్షను విధించారు. కాగా 1996-2001 మధ్య తాలిబన్లు అధికారంలో ఉన్నప్పుడు నిందితులను బహిరంగంగా రాళ్లతో కొట్టి చంపేవారు. ఇప్పుడు రాళ్లతో కాకుండా ఉరితో సరిపెట్టారు అంతే తేడా..! దీనిపై మీ రియాక్షన్ ఏంటో కింద మాతో పంచుకోండి..!
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.