అగ్రరాజ్యం అమెరికా అంచనాలు చాలావరకునిజమవుతాయి. అందునా.. విదేశీ వ్యవహారాల విషయంలో ఆ దేశానికి ఉండే లెక్కలు చాలా పక్కాగా ఉంటాయి. దాదాపు రెండు దశాబ్దాలుగా అమెరికా దన్నుగా అఫ్గాన్ లో జరిగిన పాలన.. క్రమంగా తాలిబన్ల చేతుల్లోకి వెళ్లటానికి తక్కువలో తక్కువ మరో రెండు..మూడు నెలలు పడుతుందన్న అంచనాలకు భిన్నంగా చాలా తక్కువ వ్యవధిలోనే అఫ్గాన్ ను తన సొంతం చేసుకున్నారు తాలిబన్లు.
లక్షలాది సైన్యం.. యుద్ధ విమనాలు.. ఆయుధాలు అన్ని ఉన్న అఫ్గాన్ సైన్యం ఎందుకు ఎదిరించలేకపోయింది. కనీస ప్రతిఘటన కూడా లేకుండా సింఫుల్ గా తాలిబన్లకు దేశ తాళాలు ఎలా అప్పగించారు? సైన్యాన్ని సైతం బోల్తా కొట్టించేలా తాలిబన్ల వ్యూహం ఎలా సాగింది? అగ్రరాజ్యం అంచనాలు అంత దారుణంగా ఎందుకు ఫెయిల్ అయ్యాయి? లాంటి ఎన్నో ప్రశ్నలు ఇప్పుడు తెర మీదకు వస్తున్నాయి.
అందరి అంచనాల్నితలకిందులు చేస్తూ.. కేవలం పదంటే పది రోజుల్లోనే అఫ్గాన్ ను తాలిబన్లు ఎలా వశం చేసుకున్నారు. ఎలాంటి ప్రతిఘటన లేకుండానే అధికార బదిలీ అంత సింఫుల్ గా ఎలా సాధ్యమైందన్నది ఇప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీనికి కారణం ఏమిటన్న లోతుల్లోకి వెళితే.. గడిచిన కొన్ని సంవత్సరాలుగా సాగుతున్న అవినీతే ఈ మొత్తం వినాశనానికి కారణంగా చెబుతున్నారు.
సగటు సైనికుడు మొదలు అత్యుత్తమ స్థానంలో ఉన్న వారి వరకు అందరూ లంచాలు మరగటం.. ప్రపంచ దేశాలు ఇచ్చిన నిధుల్ని అధికారులు దిగమింగి కూర్చోవటం.. కీలక సమయంలో చేతులు ఎత్తేసిన వైనం తాలిబన్లకు తేలిగ్గా అఫ్గాన్ వశమైంది. అఫ్గాన్ భద్రత కోసం దాదాపు880 కోట్ల డాలర్లను యూఎస్.. నాటో దళాలు ఖర్చు చేశాయి. ఇంత భారీ ఖర్చు బూడిదలో పోసిన పన్నీరుగా మారింది. అఫ్గాన్ వైమానిక దళంలో దాదాపు 211 విమానాలు ఉన్నాయి. కీలక దశలో అఫ్గాన్ ఎయిర్ ఫోర్సు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండిపోయింది. తాలిబన్లపై ఒక్కటంటే ఒక్క యుద్ధ విమానం కూడా ఎదిరించకపోవటం చూస్తే.. విస్మయానికి గురి కావాల్సిందే.
సైన్యంలో పెరిగిన అవినీతి.. తాలిబన్లతో వారు చేసుకున్న ఒప్పందాలు ఒక ఎత్తు అయితే.. వారి ఎత్తుల్ని చిత్తు చేసేలా ప్రభుత్వ ప్రయత్నాలు ముందుకుసాగకపోవటం కూడా ఒక కారణంగా చెప్పాలి. అఫ్గాన్ సేనల అవినీతితో పాటు.. ఆ దేశంలోని స్థానికతెగల్లో అమెరికా మీద ఉన్న వ్యతిరేకత కూడా తాలిబన్లకుకలిసి వచ్చిందన్న మాట వినిపిస్తోంది. ఇరవై ఏళ్లకు పైగా అమెరికా ఆధ్వర్యంలో జరుగుతున్న పాలన స్థానిక తెగలకు ఏ మాత్రం నచ్చట్లేదు.
దీన్ని గుర్తించిన తాలిబన్లు వారిని తమవైపునకు తిప్పుకున్నారు. ఈ కారణంతోనే తాలిబన్లు చాలా ప్రాంతాల్ని పోరాడకుండానే తమ వశం చేసుకున్నారు. దీనికి తోడు పాక్.. చైనా.. రష్యాలు అందించిన పరోక్ష సాయం.. యూఏఈ.. ఖతార్.. సౌదీ నుంచి వచ్చే విరాళాలు తాలిబన్లను మరింత బలోపేతం చేసింది. వీటన్నింటతో పాటు.. ఓపీయం పంటను భారీగా పండించి.. రహస్యంగా సరఫరా చేయటంతో వారి ఆదాయం భారీగాపెరిగింది. ఈ కారణాలన్ని కలిసి తాలిబన్ల చేతికి అఫ్గాన్ పాలనా పగ్గాలు చిక్కాయని చెప్పాలి.