ఆరాచకానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచే తాలిబన్ల ఏలుబడిలో ఉన్న అఫ్గాన్ లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయన్న విషయాన్ని చూస్తే.. ఆశ్చర్యపోవాల్సిందే. తలకు తోకకు సంబంధం లేనట్లుగా.. ఎప్పుడు ఏమనిపిస్తే దాన్నో శాసనంగా చేసే పాలకుల కారణంగా ఆ దేశంలోని పౌరులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
ఇంతకాలం మహిళలకు ఎన్నో ఆంక్షల్ని విధించి.. మగాళ్లకు బానిసలుగా మార్చేసే వైనాన్ని చూశాం. ఇప్పుడు మహిళలే కాదు.. అఫ్గాన్ లోని పురుషులకు సరికొత్త పరిమితులు విధిస్తున్న తీరు షాకింగ్ గా మారింది.
ఇప్పటికే ఆరో తరగతి దాటిన అమ్మాయిలు చదవకూడదని.. ఇంటికే పరిమితం కావాలని.. బయటకు పురుషుడితో పాటు తప్పించి.. విడిగా రాకూడదని.. ఇలా బోలెడన్ని పరిమితులు పెట్టిన తాలిబన్లు.. పురుషుల విషయంలో కొత్త రూల్స్ ను తీసుకొచ్చారు. పొడవాటి గడ్డం.. టోపీ ఉంటేనే తప్పించి ఆఫీసుల్లోకి అనుమతించమని స్పష్టం చేస్తున్నారు.
తమ ఆదేశాల్ని పక్కాగా పాటిస్తున్నారా? లేదా? అన్న విషయాన్ని తేల్చేందుకు వీలుగా తాలిబన్ మూకలు ఇప్పటికే తనిఖీలు ప్రారంభించాయి.
గడ్డం లేని ఉద్యోగులు ఆఫీసుల్లో ఉంటే వారిని తన్ని బయటకు నెట్టేశారు. గడ్డం ఉంటే తప్పించి ఉద్యోగం ఉండదని.. గడ్డం లేని వారిని ఉద్యోగాల నుంచి తొలగించాలని స్పష్టం చేశారు.
ఒకవేళ పొడవాటి గడ్డం లేకుండా.. అలా పెంచుకునే వరకు ఇంట్లోనే ఉండి.. ఆ తర్వాత ఆఫీసుకు రావాలని హెచ్చరిస్తున్నారు. ఈ లెక్కన రానున్న రోజుల్లో మరెన్ని ఆంక్షలు.. సిత్రమైన రూల్స్ ను తీసుకొస్తారో ఏమో?