చేసేది ఏదైనా భారీగా ఉండాలన్నట్లుగా ఉంటుంది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు. ఆయనేం చేసినా సరే.. గొప్పగా చెప్పుకునేలా చేయాలన్నట్లుగా ఆయన తీరు ఉంటుంది. తాను అనుకున్న పనిని త్వరగా చేసేసి.. తర్వాత పెంచుకుంటూ పోవటం కొందరు ముఖ్యమంత్రులు చేసే పని.
కానీ.. కేసీఆర్ స్టైల్ కాస్త భిన్నం. భారీ కలను బయటపెట్టటం.. దాని సాకారం కోసం తాను ప్రయత్నిస్తున్నట్లుగా చేయటం ఆయనలో కొట్టొచ్చినట్లుగా కనిపించే అంశం. ఏదైనా సరే భారీగా చేసి.. అందులోని నుంచి మైలేజీని సొంతం చేసుకునే ఎత్తుగడకు తెర తీస్తుంటారు. తాజాగా అలాంటిదే మరొక అస్త్రాన్ని బయటకు తీశారు.
హైదరాబాద్ మహానగరంలోని దిల్ షుఖ్ నగర్ కు కూతవేటు దూరంలో ఉండే చైతన్యపురి మెట్రో స్టేషన్ కు అనుకొని ఉండే.. కొత్తపేట పండ్ల మార్కెట్ స్థలంలో నిర్మించాలని భావిస్తున్న తెలంగాణ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ దేశంలోనే ఎత్తైన ప్రభుత్వ ఆసుపత్రిగా నిలిపేందుకు వీలుగా ప్రణాళికల్ని సిద్ధం చేసతున్నారు. మొత్తం 27 అంతస్తుల్లో 11.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఆసుపత్రిని రూపొందించాలన్నది తాజా ప్లాన్ గా చెబుతున్నారు.
దశాబ్దాల తరబడి ఉంటున్న పండ్ల మార్కెట్ ను ఖాళీ చేయించిన కేసీఆర్ సర్కారు.. అక్కడ భారీ ప్రభుత్వ ఆసుపత్రిని ఏర్పాటు చేసేందుకు ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించిన టెండర్ ను ఎల్ అండ్ టీ ఈ మధ్యనే సొంతం చేసుకుంది.
దీనికి సంబంధించిన డిజైన్ ఒకటి బయటకు వచ్చింది. ఇంత భారీ సర్కారు దవాఖానా దేశంలోనే లేదన్న మాటను వైద్య ఆరోగ్య శాఖకు చెందిన అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. టిమ్స్ పేరుతో ఎల్బీ నగర్.. అల్వాల్.. సనత్ నగర్ లో వెయ్యేసి పడకల చొప్పున సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్ని ప్రభుత్వం నిర్మిస్తున్న వేళ.. కొత్త పేట ఆసుపత్రికి సంబంధించిన కొత్త విషయం తాజాగా వెలుగు చూసింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.