సీఎంగా ప్రమాణస్వీకారం చేసినంతనే రేఖా గుప్తా ఏం చేశారంటే?

అయితే.. తన ఎంపికలో బీజేపీ అధినాయకత్వం తప్పు చేయలేదన్న విషయాన్ని తన చేతలతో చూపే ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపించింది రేఖాగుప్తా తీరు చూస్తే.

Update: 2025-02-21 05:58 GMT

అదేమి చిన్న పదవి కాదు. ఢిల్లీ రాష్ట్రానికి సీఎం. అది కూడా ఎమ్మెల్యేగా గెలిచిన మొదటిసారే అంతటి గురుతర బాధ్యత లభించటం మామూలు విషయం కాదు. అయితే.. తన ఎంపికలో బీజేపీ అధినాయకత్వం తప్పు చేయలేదన్న విషయాన్ని తన చేతలతో చూపే ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపించింది రేఖాగుప్తా తీరు చూస్తే. సాధారణంగా ఏ ముఖ్యమంత్రి అయినా తన ప్రమాణస్వీకార మహోత్సవం ముగిసిన తర్వాత.. తనను కలిసేందుకు వచ్చే ప్రముఖులకుు టైం ఇవ్వటం.. పార్టీ సహచరులతో భేటీ కావటం లాంటివి చేస్తారు.

ప్రమాణస్వీకారం తర్వాత పదవీ బాధ్యతల్ని చేపట్టేందుకు కాస్తంత ముహుర్తబలం చూసుకోవటం కనిపిస్తుంది. కానీ.. ఈ తీరుకు భిన్నంగా వ్యవహరించారు రేఖా గుప్తా. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాతి నిమిషం నుంచే పనిలో దిగిపోయారు. నేరుగా సచివాలయానికి వెళ్లిన ఆమె.. తన ఛాంబర్ లో పని మొదలు పెట్టేశారు. అనంతరం తన కార్యాలయ సిబ్బందితో మాట్లాడిన ఆమె.. తనను తానే స్వయంగా పరిచయం చేసుకోవటం చూస్తే.. సమ్ థింగ్ స్పెషల్ అన్నట్లుగా కనిపిస్తుంది.

సాయంత్రం 5 గంటల వేళలో యమునా బజార్ లోని వాసుదేవ్ ఘాట్ ను సందర్శించిన ఆమె.. సెక్రటేరియట్ కు చేరుకొని.. రాత్రి ఏడు గంటల ప్రాంతంలో కేబినెట్ భేటీని నిర్వహించారు. తనతో మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన ఆరుగురు మంత్రులతో తొలి మంత్రివర్గ భేటీని నిర్వహించారు. ఇలా ప్రమాణస్వీకారం చేసిన కాసేపటి నుంచే వర్కులో దిగిపోయిన రేఖా గుప్తా తీరును చూసినోళ్లు.. ఢిల్లీ సీఎంగా మోడీ అండ్ కో చేసిన ఎంపిక పర్ ఫెక్టుగా ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News