జగన్‌పై పర్సనల్ ఎటాక్ కరక్టేనా.. !
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌పై పర్సనల్ ఎటాక్ చేయడం మంచిదేనా? ఆయనకు మైండ్ పనిచే యడం లేదని.. మెంటల్ ఆసుపత్రికి పంపించాలని.. ప్రత్యేక మందులు వాడాలని నేరుగా మంత్రులు వ్యాఖ్యలు చేస్తున్నారు.
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌పై పర్సనల్ ఎటాక్ చేయడం మంచిదేనా? ఆయనకు మైండ్ పనిచే యడం లేదని.. మెంటల్ ఆసుపత్రికి పంపించాలని.. ప్రత్యేక మందులు వాడాలని నేరుగా మంత్రులు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక, టీడీపీ అనుకూల మీడియా కూడా ఇదే పంథాలో ముందుకు సాగుతోంది. అదేవిధంగా సామాజిక మాధ్యమాల్లో వస్తున్న రీల్స్, ఇతర చర్చల్లో కూడా.. టీడీపీ అనుకూల నాయకులు, యూట్యూబర్లు సైతం జగన్‌పై వ్యంగ్యాస్త్రాలు పేలుస్తున్నారు.
జగన్ మానసిక పరిస్థితి బాలేదని.. ఆయనను ఇప్పుడే ఆసుపత్రికి పంపించాలని రీల్స్‌లో ఊదర గొడుతు న్నారు. అయితే.. ఇలా జగన్‌పై పర్సనల్ ఎటాక్ చేయడం మంచిదేనా? అంటే.. రాజకీయాల్లో ఇవి కామనే కదా! అనే చర్చ ఒకటి తెరమీదికి వచ్చింది. కానీ.. ప్రస్తుతం జగన్ సానుభూతి కోసం ప్రయత్నం చేస్తున్నా రు. గత ఎన్నికలకు ముందు ఆయన ప్రజలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినా.. ప్రజలు ఓడించారు. ఈ క్రమంలో 11 స్థానాలకే పరిమితం అయ్యారు.
అప్పటి నుంచి జగన్ సానుభూతి కోసం ప్రయత్నం చేస్తున్న దరిమిలా.. ఇలా వ్యక్తిగతంగా ఆయనను టార్గెట్ చేయడం మంచిది కాదన్నది పరిశీలకుల భావన. ఒకవైపు రాష్ట్రాన్ని ధ్వంసం చేశారని.. ఆరోపి స్తూ.. ప్రజల మధ్యకు తీసుకువెళ్తున్న దరిమిలా.. ఇప్పుడు వ్యక్తిగత దాడి కూడా.. చేస్తే అది సర్కారు పై ప్రభావం చూపుతుందని, అదేసమయంలో జగన్‌కు దూరంగా ఉన్న వర్గాలు కూడా దగ్గరకు అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.
``వ్యక్తిగతంగా టార్గెట్ చేసి.. పవన్‌కు బలాన్ని చేకూర్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. వైసీపీ వ్యక్తిగతంగా పవన్ ఇమేజ్‌ను దెబ్బతీసే ప్రయత్నం చేసింది. తద్వారా వైసీపీకి మేలు కంటే పవన్ కే ఎక్కువగా మేలు జరిగింది. ఈ విషయాన్ని మా వాళ్లు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. విధాన పరమైన అంశాల ఆధారంగానే రాజకీయాలుసాగితే బెటర్`` అని సీనియర్ టీడీపీ నాయకుడు ఒకరు సూచించారు. వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం వల్ల.. ఏ పార్టీ కూడా ప్రజల మన్ననలు పొందలేదన్న విషయాన్ని గుర్తించాలని ఆయన చెబుతున్నారు.