నువ్వు గోల్డెహే.. ! ఐదుకిలోల బంగారం ధరించి నామినేషన్ వేసిన హరినాడార్..!
తమిళనాడు లో ఓ బంగారు బాబు ఉన్నాడు. ఆయనే హరినాడార్. ఒంటి నిండా కిలోలకొద్దీ బంగారం ధరిస్తూ అందరినీ ఆకర్షిస్తుంటాడు. ఆ మధ్య ఓ సినిమాలో కూడా నటిస్తున్నట్టు ప్రకటించాడు. అప్పుడప్పుడు కిలోల కొద్ది బంగారం ఒంటిమీద ధరించి.. ప్రముఖుల వేడుకల్లో కనిపిస్తూ మీడియా దృష్టిని ఆకర్షిస్తుంటాడు. ప్రస్తుతం తమిళనాడు లో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఓ నియోజక వర్గంలో నామినేషన్ దాఖలు చేసి మరోసారి మీడియా దృష్టిని ఆకర్షించాడు హరి నాడార్. ప్రస్తుతం అళంగుళం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశాడు. ఆయన నామినేషన్ దాఖలు చేసేందుకు తన ఒంటిమీద దాదాపు 5 కిలోల బంగారం ధరించి వచ్చాడు. ఆయన వేషధారణను చూసిన ప్రజలు, మీడియా ఆశ్చర్యపోయాయి.
నిజానికి తమిళ ప్రజలకు ఆయన కొత్త కాదు. నిన్న జాతీయ మీడియా సంస్థల్లోనూ ఈ వార్త వచ్చింది. తన వద్ద మొత్తంగా 11.2 కేజీల బంగారం ఉందని.. నామినేషన్ పత్రాల్లో పేర్కొన్నాడు హరినాడార్. ప్రస్తుతం ఆయన నామినేషన్ వేసిన ఫొటో సోషల్మీడియాలో వైరల్గా మారింది. భారతీయులకు బంగారం ఎంత ప్రీతిపాత్రమైందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా స్త్రీలకు బంగారు ఆభరణాల మీద ఎక్కువ మోజు ఉంటుంది. ఏ పేరంటానికి వెళ్లినా.. బంగారు ఆభరణాలు ప్రదర్శించడం వాళ్లకు అలవాటు. ఎంత ఖరీదైన నగలు ధరించారు..
ఎన్ని వెరైటీ ఆర్నమెంట్లు పెట్టుకున్నారన్న దాని మీదే వాళ్ల విలువ ఆధారపడి ఉంటుంది. అంతలా ఇక్కడ బంగారానికి క్రేజ్ .ఇదిలా ఉంటే అప్పుడప్పుడు మనదేశంలో ఇటువంటి బంగారు బాబులు కూడా ప్రత్యక్షమవుతుంటారు. ఏకంగా బంగారంతో దుస్తులు కూడా కుట్టించుకున్నారు గతంలో కొందరు.తాజాగా ఈ హరినాడార్ ఒంటినిండా బంగారం ధరించి అందరినీ ఆకర్షించాడు.