చిన్నమ్మ చేతిలో సెల్వం రాజీనామా లేఖ‌

Update: 2017-01-03 08:06 GMT
త‌మిళ‌నాడులో రాజ‌కీయ ప‌రిణామాలు శ‌ర‌వేగంగా మారుతున్నాయి. అన్నాడీఎంకే ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా శ‌శిక‌ళ ప‌దవీ బాధ్య‌త‌లు స్వీక‌రించ‌డం, అనంత‌రం ఆమెకు విదేయ‌త‌ను చాటుకునేందుకు నేత‌లు పోటీప‌డుతూ సీఎం ప‌ద‌వి చేప‌ట్టమ‌ని కోరుతున్న క్ర‌మంలో ముఖ్య‌మంత్రి ప‌న్నీర్ సెల్వం త‌న ప‌ద‌వికి రాజీనామా చేసిన‌ట్లు అన్నాడీఎంకే వ‌ర్గాలు చెప్తున్నాయి. స‌ద‌రు రాజీనామా ప‌త్రాన్ని చిన్న‌మ్మ శ‌శిక‌ళ‌కు ఇచ్చార‌ని, సంద‌ర్భానుసారం ఆ లేఖ‌ను శ‌శిక‌ళ బ‌య‌ట‌పెడ‌తార‌ని వెల్ల‌డిస్తున్నారు.

అన్నాడీఎంకే ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా చిన్న‌మ్మ ప‌ద‌వీబాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత ప‌లువురు నేత‌లు ఆమెను పోయెస్ గార్డెన్స్‌లో క‌లుసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో లోక్ సభ డిప్యూటి స్పీకర్ తంబిదురై - కీలక మంత్రి ఉదయ్ కుమార్ సైతం చిన్న‌మ్మ‌తో భేటీ అయ్యారు. అనంత‌రం వారు మీడియాతో మాట్లాడుతూ సీఎం ప‌ద‌విని చిన్న‌మ్మ చేప‌ట్టాల‌ని బ‌హిరంగంగ డిమాండ్ చేశారు. అంత‌టితో ఈ ఎపిసోడ్ ముగించ‌కుండా శ‌శిక‌ళ కోసం ప‌న్నీర్ సెల్వం ప‌ద‌వికి రాజీనామా చేస్తార‌ని ప్ర‌క‌టించారు. ఈ ప‌రిణామాల‌తో క‌ల‌త చెందిన సెల్వం త‌న ప‌ద‌వికి గుడ్ బై చెప్పాల‌నుకున్నార‌ని అన్నాడీఎంకే వ‌ర్గాలు అంటున్నాయి. ఈ మేర‌కు రాజీనామా లేఖ‌ను శ‌శిక‌ళ‌కు అప్ప‌గించార‌ని అంటున్నారు. శ‌శిక‌ళ ఎప్పుడు సీఎం కావాల‌నుకుంటే అప్పుడు ఈ లేఖ‌ను బ‌య‌టపెడ్తార‌ని అన్నాడీఎంకే వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News