వివాదాల‌కు-ఈయ‌న‌కు చాలా ద‌గ్గ‌ర సంబంధం ఉందే!

Update: 2023-01-07 16:30 GMT
కొంద‌రు అంతే!వారు మార‌రు.. అంటారు క‌దా.. అచ్చం  ఆ టైపులోనే వ్య‌వ‌హ‌రిస్తున్నారు త‌మిళ‌నాడు గ‌వ ర్న‌ర్ ఆర్ . ఎన్‌. ర‌వి.  గ‌తంలో కేంద్ర స‌ర్వీసులు చేసిన ర‌వి.. ప్ర‌స్తుతం త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్‌గా ఉన్నారు. అయితే.. ఈయ‌న నిత్యం వివాదాల‌కు.. విభేదాల‌కు చాలా చాలా ద‌గ్గ‌ర‌గా ఉంటున్నార‌నే పేరు తెచ్చుకు న్నారు. గ‌తంలో ఇక్క‌డ ప‌నిచేసిన తెలుగువారు రోశ‌య్య మాదిరి ఉండాల‌ని త‌మిళ‌నాడు ప్ర‌జ‌లు కోరుకుంటున్నారు.

కానీ, ర‌వి మాత్రం 'రోశ‌య్య 'గా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే టాక్ ఉంది. ద్రావిడ పార్టీల పాలన కారణంగా ఐదు దశాబ్దాలపాటు రాష్ట్ర ప్రజలు మోసపోయారని  ఇటీవ‌ల ర‌వి చేసిన వ్యాఖ్య‌లు మంట‌లు రేపాయి. దీంతో ఆయ‌న కొంత వ‌ర‌కు దిగి వ‌చ్చారు. ఇక‌, ఇప్ఉడు మరోసారి.. త‌మిళుల సెంటిమెంటునే కెలికేసి.. మ‌రో వివాదానికి, కీల‌క‌మైన ర‌చ్చ‌కు తెర‌దీశారు.

రాష్ట్రం పేరు 'తమిళనాడు'కు బదులుగా 'తమిళగం' అని మారిస్తే సబబుగా ఉంటుందంటూ గ‌వ‌ర్న‌ర్ ఆర్‌. ఎన్‌. ర‌వి వ్యాఖ్యానించారు. దీంతో గవర్నర్‌ వ్యవహారశైలిపై డీఎంకే కూటమిపక్షాలతో పాటు ఈ సారి అన్నాడీఎంకే కూడా మండిపడింది.

డీఎంకే వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి అన్నాదురై, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి చొరవతో 'మద్రాసు రాష్ట్రం'గా ఉన్న పేరును తమిళనాడు అని నామకరణం చేశారని, ఆ పేరే దశాబ్దాలుగా కొనసాగుతుండగా గవర్నర్‌ కొత్త పేరు సూచించడం గర్హనీయమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎండీఎంకే నేత వైగో, అమ్మామక్కల్‌ మున్నేట్ర కళగం నాయకుడు దినకరన్‌, మనిదనేయ మక్కల్‌ కట్చి నేత జవాహిరుల్లా వేర్వేరు ప్రకటనలో గవర్న ర్ రవి బీజేపీ నేతలా వ్యవహరిస్తున్నారని, రాష్ట్రంలో చిచ్చురగిల్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

అన్నాడీఎంకే సీనియర్‌ నేత డి.జయకుమార్‌ స్పందిస్తూ.. అన్నాదురై అడుగుజాడల్లోనే తమ పార్టీ నడుస్తోందని, కనుక రాష్ట్రాన్ని తమిళగం అని పిలవాలని గవర్నర్‌ ప్రకటన తీవ్రంగా ఖండిస్తున్నామని స్పష్టం చేశారు.  మొత్తానికి దేశ‌వ్యాప్తంగా గ‌వ‌ర్న‌ర్లు ఏదో ఒక రూపంలో వివాదాల్లో మునిగి తేలుతుండ‌డం గ‌మ‌నార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News