చిత్తూరు జిల్లా తిరుపతికి సమీపంలోని శేషాచలం అడవుల్లో చోటు చేసుకున్న భారీ ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన ఆసక్తికర కథనం ఒకటి ప్రచారంలోకి వచ్చింది. ఈ భారీ ఎన్‌కౌంటర్ని పోలీసులు కావాలనే చేశారంటూ సరికొత్తగా ఆరోపిస్తున్నారు.
తాజాగా ప్రచారంలోకి వచ్చిన కథనం ఏమిటంటే.. తమిళనాడు నుంచి బస్సులో వస్తున్న ఏడుగురిని పోలీసులు నగరి వద్ద పట్టుకెళ్లి కాల్చేశారంటూ మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. బస్సులో వేరే సీట్లో కూర్చున్న వ్యక్తి ఒకరు తప్పించుకొని.. ఈ విషయాన్ని వెల్లడిస్తున్నట్లు చెబుతున్నారు.
మరోవైపు శేషాచలం అడవుల్లో ఎన్ కౌంటర్ కారణంగా చనిపోయిన మృతుల కుటుంబాలకు తమిళనాడు ప్రభుత్వం రూ.3లక్షలు చొప్పున పరిహారం ప్రకటించింది. తాజా ఎన్ కౌంటర్‌పై తమిళనాడులో తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తున్నాయి. మరి.. అసలు సంగతేమిటనేది ఇప్పుడు పెద్ద సందేహంగా మారింది.