కమల్ హాసన్ నోట సీఎం జగన్ మాట !

Update: 2020-12-14 11:32 GMT
రాష్ట్రం నలుమూలల అభివృద్ధి చెందాలి అంటే రాజధానుల వికేంద్రీకరణ అవసరం అంటూ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లుని తీసుకువచ్చింది. అయితే , ఆ మూడు రాజధానుల అంశం వివాదం రాజుకోవడం తో అది కొనసాగుతూనే ఉంది. అయితే , ఈ రాజధానుల వికేంద్రీకరణ పక్కనున్న తమిళనాడు కి కూడా పాకినట్టు కనిపిస్తుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ మక్కల్‌ నీదిమయ్యం అధికారంలోకి వస్తే మదురైని రెండో రాజధానిగా ఏర్పాటు చేస్తానని ఆ పార్టీ అధ్యక్షుడు కమల్‌హాసన్‌ కీలక ప్రకటన చేశారు.

మదురైలో ఆదివారం సాయంత్రం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ .. ప్రాచీన కాలం నుంచి మదురై తమిళుల రాజధానిగా వుండేదని, తమిళ సంస్కృతి, కళలకు కాణాచిగా వున్న ఆ నగరాన్ని రెండో రాజధానిగా ఏర్పాటు చేస్తానని అన్నారు. ప్రస్తుతం ఉన్న దుష్ట రాజకీయ శక్తులు రాజకీయాల్లో మంచివారెవరూ వుండరనే భావనను ప్రజలలో నాటుకునేలా చేశాయి అని .,మక్కల్‌ నీదిమయ్యం అధికారంలోకి వస్తే అధికారులంతా ప్రజలవద్దకే వెళ్ళి వారి సమస్యలను పరిష్కరిస్తారని, అంటే ప్రజల వద్దకే పాలనను అందించడానికి తాను సిద్ధంగా ఉన్నానని కమల్ ‌హాసన్‌ చెప్పారు.

రాష్ట్రంలో ప్రధాన పార్టీల కూటముల్లో తప్పకుండా చీలికలు ఏర్పడతాయని కమల్‌హాసన్‌ తెలిపారు. ఎన్నికలు సమీపించేవేళ కూటముల్లో కొన్ని పార్టీలు వైదొలగుతాయని, మరికొన్ని పార్టీలు కొత్తగా వచ్చి చేరుతాయన్నారు. కొన్ని కూటముల్లో అసంతృప్తి జ్వాలలు అధికమై ఊహించని విధంగా చీలికలు కూడా ఏర్పడే అవకాశముందన్నారు. ప్రజల ఆదరాభిమానాలతో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నానని, తన పర్యటన విజయవంతమవుతుందని కమల్‌ ధీమా వ్యక్తం చేశారు. అయితే , తమిళనాడు లో కమల్ పార్టీ అధికారంలో వస్తుందో, రాదో తెలియదు కానీ వచ్చే రోజుల్లో క మధురై ప్రాంత ప్రజల్లో మాత్రం రాజధాని ఆశలు పెరుగుతాయి. భవిష్యత్ లో ఇది అలా అలా పెరిగి డిమాండ్ గా మారుతుంది.
Tags:    

Similar News