రేప్ చేసిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలా? ఓ వైపు న్యాయస్థానం సైతం ఈ విషయం మీద కాస్తంత సానుకూలంగా వ్యవహరించి.. దోషికి మధ్యవర్తిత్వం చేసుకునే అవకాశం ఇచ్చిన ఉదంతంలో.. సదరు బాధితురాలి స్పందన ఏలా ఉంటుందన్న ఆసక్తి సర్వత్రా వినిపించింది.
అయితే.. ఆమె మాత్రం పెళ్లికి ససేమిరా అంటున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఈ ఉదంతం తమిళనాడులో చోటు చేసుకుంది. దీని వివరాల్లోకి వెళితే.. దాదాపు ఏడేళ్ల కిందట జరిగింది. అప్పట్లో పదిహేనేళ్ల బాధితురాలిని.. 22 ఏళ్ల మోహన్ అనే వ్యక్తి అత్యాచారం చేశారు. ఈ నేరంలో కింది కోర్టు ఏడేళ్లు జైలుశిక్ష విధించింది.
అత్యాచారం జరిగిన తర్వాత ఆ బాలిక ఒక బాలికకు జన్మనిచ్చింది. ఇప్పుడు ఆ బాలిక ఆమెతోనే ఉంటోంది. తాజాగా సదరు ముద్దాయికి కోర్టు ఒక అవకాశం ఇస్తూ.. తాను చేసిన తప్పును సరిదిద్దుకునేందుకు బాధితురాలిని పెళ్లి చేసుకునే అంశంపై మధ్యవర్తిత్వం ద్వారా నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొంది. దీంతో.. ఈ వ్యవహారంపై సదరు బాధితురాలు ఎలా స్పందిస్తుందా? అన్నది ప్రశ్నగా మారింది.
ఈ నేపథ్యంలో ఒక మీడియా సంస్థ ఆమె వద్దకు వెళ్లి.. కోర్టు పేర్కొన్న విషయాన్ని చెప్పి పెళ్లి చేసుకునేందుకు సిద్ధమేనా అంటే ఆమె నో చెప్పేసింది. ఒకవేళ నీ పేరు మీద కానీ.. నీ కూతురు పేరు మీద కానీ ఆ వ్యక్తికి ఉన్న ఆస్తి మొత్తం రాసిస్తే పెళ్లి చేసుకోవటానికి సిద్ధమేనా అని ప్రశ్నిస్తే.. అలా చేసినప్పటికీ ఆ వ్యక్తిని తాను పెళ్లి చేసుకోనని పేర్కొంది. కోర్టులతో సహా అందరిని మభ్య పెట్టటానికి చాలానే చెబుతారు.. అందుకు రాజీకి ఒప్పుకునేది లేదని తేల్చేసింది. అన్యాయాన్ని రాజీతో సరిపుచ్చలేమన్న సందేశాన్ని ఇస్తూ.. సదరు బాధితురాలు చెప్పిన మాటకు న్యాయస్థానం ఎలా స్పందిస్తుందో చూడాలి.