ఆంధ్రా హోటళ్ల మీద పడ్డారు

Update: 2015-04-12 08:45 GMT
ఎర్రచందనం దొంగలపై శేషాచల అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 20 మంది మృతి చెందటం.. వారంతా తమిళనాడుకు చెందిన వారు కావటం.. దీనికి నిరసనగా ఆందోళనలు చోటు చేసుకోవటం తెలిసిందే.

గత కొద్దిరోజులుగా బస్సులు.. లారీల మీద పడిన ప్రభావం.. ఆ మధ్యన కొన్ని ఆంధ్రా ఆస్తుల మీద తమిళులు టార్గెట్‌ చేయటం తెలిసిందే. తాజాగా.. ఆంధ్రా ప్రాంతానికి చెందిన నాలుగు హోటళ్లపై తమిళులు తాజాగా దాడి చేవారు. ఆదివారం ఉదయం చోటు చేసుకున్న ఈ ఘటనల్లో హోటళ్లు పూర్తి ధ్వంసమయ్యాయి.

దీంతో.. ఆ నాలుగు హోటళ్ల యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక.. ఆంధ్రా.. తమిళనాడు సరిహద్దుల వెంట కూడా ఉద్రిక్తత చోటు కొనసాగుతోంది. సరిహద్దుల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు వీలుగా ఇరు ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు.

జరిగిన ఎన్‌కౌంటర్‌ విషయంపై తమిళులకు ఉన్న సందేహాలు తీర్చాల్సిన బాధ్యత ఏపీ సర్కారు మీద ఉంటే.. తమిళనాడులో ఇష్టారాజ్యంగా నిరసనలు.. ఆందోళనలు చేస్తున్న తమిళుల్ని కంట్రోల్‌ చేయాల్సిన బాధ్యత తమిళనాడు ప్రభుత్వం మీద ఉంది. ఇదిలానే కొనసాగితే.. తమిళనాడుకు తీరని నష్టం వాటిల్లే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటివరకూ జరిగిన ఘటనలపై ఏపీ నేతలు.. పార్టీలు సంయమనం పాటించాయే కానీ.. ఎక్కడా మాట తూలలేదన్న విషయానిన తమిళనాడు సర్కారు గుర్తించి.. ఆందోళనలను అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Tags:    

Similar News