తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సైకు.. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు మధ్య సంబంధాలు లేవన్న సంగతి తెలిసిందే. గతంలో గవర్నర్ గా వ్యవహరించిన ఈ.ఎస్.ఎల్.నరసింహన్ తో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంత సన్నిహితంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశంలో మరే గవర్నర్ కు.. ముఖ్యమంత్రికి లేనంత అనుబంధం వారి సొంతంగా చెప్పాలి. నరసింహన్ గవర్నర్ గా ఉన్న వేళలో.. రాజ్ భవన్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యధికసార్లు వెళ్లటమే కాదు.. గంటల తరబడి ఆయనతో గడిపేవారు.
ఆయనతో బోలెడన్ని విషయాల్ని చర్చించేవారని చెప్పేవారు. తమ భేటీ అనంతరం ప్రభుత్వ విధానాల్ని గవర్నర్ కు వివరించినట్లుగా సీఎంవో అనధికార ప్రెస్ నోట్ విడుదల చేసేది. లక్క.. బంగారం మాదిరి వ్యవహరించిన వారి బంధం.. రెండో దఫా ఆయన పదవీ కాలం ముగియటంతో బ్రేకులు పడ్డాయి. నరసింహన్ తర్వాత ఆ పదవిని చేపట్టిన తమిళ సై పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ మొదట్నించి సానుకూలంగా లేరన్న ఆరోపణ వినిపిస్తూ ఉంది.
గవర్నర్ గా కేంద్రం మహిళను ఎంపిక చేయటం సీఎం కేసీఆర్ కు నచ్చలేదంటారు.
దీనికి తోడు ఆమె వెనుకబడిన వర్గాలకు చెందిన వ్యక్తి కావటం కూడా.. తమిళ సైనున దూరంగా పెట్టినట్లు చెబుతారు. తాను సీఎం కేసీఆర్ కు ఇవ్వాల్సినంత మర్యాద ఇస్తానని.. కానీ.. ముఖ్యమంత్రి నుంచి మాత్రం స్పందన ఉండదని.. రాజ్ భవన్ లో నిర్వహించే కార్యక్రమాలకు సైతం గైర్హాజరు కావటాన్ని ప్రస్తావించారు.
ఇటీవల కాలంలో గవర్నర్.. ముఖ్యమంత్రి మధ్య సరైన టర్మ్స్ లేవన్న ప్రచారం జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. దీనికి తోడు ఇటీవల కాలంలో ప్రభుత్వం ఆమోదించి పంపిన బిల్లులపై రాజముద్ర వేయకుండా తమ వద్దే ఉంచేసుకుంటున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు తమిళ సై. ఇదిలా ఉంటే.. తాజాగా తెలంగాణ గవర్నర్ కు.. ప్రభుత్వానికి మధ్య రచ్చ మరింత పెరిగినట్లుగా చెబుతున్నారు. అంతేకాదు.. దీనికి సంబంధించిన వార్తలు ఇప్పుడు మీడియాలో ప్రముఖంగా వస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. తాజాగా గవర్నర్ తమిళ సై సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. రాజ్ భవన్ లో బుధవారం సాయంత్రం ఆమె ప్రెస్ మీట్ పెట్టాలని డిసైడ్ అయ్యారు. సాధారణంగా గవర్నర్ స్థాయిలో ఉన్న వారెవరూ ప్రెస్ మీట్లు పెట్టటం.. మీడియాతో సమావేశాలు నిర్వహించి మాట్లాడటం లాంటివి చేయరు.
చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే మాట్లాడతారు. మీడియా ముందుకు వస్తారు. అంతేతప్పించి.. ప్రత్యేకగా మీడియాను పిలిపించి.. మరీ ప్రెస్ మీట్ పెట్టటం చాలా తక్కువన్న మాట వినిపిస్తోంది. మరి.. తాజాగా నిర్వమించే ప్రెస్ మీట్ లో సంచలన విషయాల్ని ప్రస్తావించటం ఖాయమని.. ప్రభుత్వ తీరును తప్పు పట్టటం అనివార్యమన్న మాట వినిపిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.