కేంద్ర ప్రభుత్వ పథకాలను, లక్ష్యాలను, విధానాలు అందిపుచ్చకోవడంలో ఏపీ కంటే ఇతర రాష్ట్రాలు ముందుంటున్నాయి. నిజానికి కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామి అయిన ఏపీ ప్రభుత్వం ఈ విషయంలో దూకుడుగా ఉండాలి. కానీ... ఎందుకో వెనుకబడుతోంది..
ప్రదాయేతర ఇంధన వనరుల రంగాన్ని భారీ ఎత్తున ప్రోత్సహించడానికి కేంద్రం కంకణం కట్టుకున్న సంగతి తెలిసిందే. అందులోభాగంగానే సోలార్ ఎనర్జీని ప్రోత్సహిస్తోంది. ఇందులో భారీ సోలార్ ప్లాంటుల నిర్మాణం ఒకటైతే.... ఇళ్లపైనే సౌర విద్యుత్ తయారుచేసుకునేలా రూఫ్ టాప్ సోలార్ పవర్ జనరేషన్ పథకం ఇంకోటి. దీనికి సంబంధించి ఏపీలో ఇంకా ముందువెనుకాడుతుంటే పొరుగునే ఉన్న తమిళనాడు మాత్రం అప్పుడే ఇంప్లిమెంటేషన్ మొదలుపెట్టి కేంద్రం వద్ద మార్కులు కొట్టేసింది. ఇంకా చెప్పాలంటే కేంద్రం ఇళ్లపై ఏర్పాటు చేయమంటే తమిళనాడు మరో అడుగు ముందుకేసి పాఠశాలలపై ఏర్పాటు చేసింది. కాంచీపురం జిల్లాలోని రాణి అన్నాదురై మున్సిపల్ మిడిల్ స్కూల్... మున్సిలప్ హయ్యర్ సెకండరీ స్కూల్ పై వీటిని ఏర్పాటు చేశారు. మరోవారం రోజుల్లో ఇవి ఉత్పత్తి మొదలుపెడతాయట. వీటిలో ఒకటి 3కేవీ ప్లాంటయితే... రెండోది 2 కేవీ ప్లాంటు. ఒక్కొక్కటి సుమారు 2 వేల వాట్లు కరెంటు ఇస్తాయి. ఒక్కొక్క ప్లాంటుతో 25 ఫ్యాన్లు, 25 బల్బులు పనిచేస్తాయి. త్వరలో మరికొన్ని ప్రాంతాల్లోనూ ఇలాంటివి ఏర్పాటు చేయడానికి తమిళనాడు ప్రభుత్వం రెడీ అవుతోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇలాంటి విషయాల్లో దూకుడు చూపితే కేంద్రం వద్ద గుడ్ విల్ ఏర్పడుతుంది. లేదంటే పొత్తు లేని రాష్ట్రాలు కూడా కేంద్రం దృష్టిలో పడి లాభపడతాయి.