శేషాచలం ఎన్‌కౌంటర్ వ్యవహారంపై తమిళనాడులోని పార్టీలన్నీ ఒక తాటిపైకి వస్తున్నాయి. అధికారపక్షం, ప్రతిపక్షం తేడా లేకుండా.. ఈ వ్యవహారంలో విచారణను డిమాండ్ చేస్తూ తమిళ పార్టీలు కేంద్రంపై ఒత్తిడి పెంచడానికి సిద్ధం అవుతున్నాయి. ఈ వ్యవహారంపై మరింత రభస చేయడానికే తమిళ పార్టీలన్నీ డిసైడ్ చేసుకొన్నట్టుగా తెలుస్తోంది.
ఇప్పటికే వైగో వంటి వాళ్లు చిత్తూరు వరకూ వచ్చి నిరసన ప్రదర్శనలు చేసి వెళ్లారు. ఇక ఈ నెల 17 వ తేదీన ఈ ఎన్‌కౌంటర్‌పై నిరసన ప్రదర్శనలు అంటూ శరత్‌కుమార్ ప్రకటించాడు. ఎమ్మెల్యే హోదాలో ఉన్న ఈ నటుడు కూడా ఎన్‌కౌంటర్ వ్యవహారాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నాడు.
ఇక ఈ అంశంపై అఖిలపక్షంగా ఢిల్లీ వెళదామని పీఎంకే వాళ్లు అంటున్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. తమిళుల అన్యాయంగా హతమైనా.. సీఎం సరిగా స్పందించడం లేదని ఆయన వ్యాఖ్యానిస్తున్నాడు.
ఈ విధంగా తమిళ పార్టీలు అన్నీ అధికార పక్షంపై విరుచుకుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికార అన్నాడీఎంకే కూడా డిఫెన్స్‌లో పడుతోంది. దీంతో ఆ పార్టీ ఈ వ్యవహారాన్ని కేంద్రం కోర్టులోకి తోసేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్ని పార్టీలూ కలిసి తమను విలన్‌గా చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో అన్నాడీఎంకే వాళ్లు కూడా ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వపరిధిలోకి తీసుకెళ్లే అవకాశం ఉంది.
దీనిపై విచారణ జరిపించాలని కేంద్రాన్ని కోరితే.. ఓ పని అయిపోతుందని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం భావించే అవకాశాలున్నాయి. అఖిలపక్షం అంటూ ఒక టీమ్‌ను పంపి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అప్పుడు విచారణ జరిగినా.. జరగకపోయినా అన్నాడీఎంకేకు పెద్ద ఇబ్బంది ఉండదు. విచారణ జరగకపోతే..దానికి కారణం భారతీయ జనతా పార్టీ అంటూ ఆ పార్టీని కార్నర్ చేయవచ్చు కదా.. అదీ ప్లాను!