కరడుగట్టిన హిందూత్వ వాది, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ నిజంగానే చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారనే చెప్పాలి. సినీ ఇండస్ట్రీలోని మహిళలపై ప్రత్యేకించి నటుల భార్యలపై ఆయన చేసిన కామెంట్లు చాలా జుగుత్సను కలిగించేవేనని చెప్పక తప్పదు. రోజుకో భర్తను మార్చే సంస్కృతి ఒక్క సినీ ఇండస్ట్రీలోనే ఉందంటూ బీజేపీకే చెందిన ఓ నేత చేసిన కామెంట్‌పై సినీ జనాలు కుమిలిపోతుండగా, అది చాలదన్నట్లుగా ఓ టీవీ లైవ్ షోలో పాలుపంచుకున్న సందర్భంగా ఆ నేత చేసిన వ్యాఖ్యలు నిజమేనని, ఆ సంస్కృతి టాలీవుడ్‌లో ఉండనే ఉందంటూ రాజా సింగ్ వ్యాఖ్యానించారు. అదే లైవ్ షోలో ఉన్న టాలీవుడ్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆ వ్యాఖ్యలపై అక్కడికక్కడే ఆగ్రహంతో కూడిన ఆవేదనను వ్యక్తం చేశారు.
అంతేకాకుండా ఓ రాజకీయ నేతగా, ఓ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి నోట ఈ తరహా మాటలు రావడమేమిటని ప్రశ్నించిన తమ్మారెడ్డి... రాజాసింగ్ బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు. ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేసే నేతలతో చర్చలో పాలుపంచుకునే కుసంస్కారం తనకు లేదని, లైవ్ షోలో నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఓ వీడియో సందేశాన్ని విడుదల చేసిన తమ్మారెడ్డి... అందులో సినీ స్టార్ల అభిమానులకు ఓ సంచనాల్మతక సందేశం ఇచ్చారు. సినిమా వాళ్లను, సినిమా ఇండస్ట్రీకి చెందిన నటుల భార్యలపై ఓ బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఇది ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. సినీ స్టార్లంటే పడి చచ్చే... అభిమానులు ఇలాంటి నేతలకు గుణపాఠం చెప్పి తీరాల్సిందేనని కూడా తమ్మారెడ్డి స్టార్ల ఫ్యాన్స్‌కు పిలుపునిచ్చారు.
సినిమా అంటే మీ అభిమాన తారలు మాత్రమే కాదని, అలాగే మీ అభిమాన తారలు కూడా సినీ ఇండస్ట్రీకి చెందిన వారేనన్న భావనతోనే తాను ఈ పిలుపునిస్తున్నానని చెప్పుకొచ్చారు. తమ అభిమాన నటుల విషయంలో ఎంతకైనా తెగించే వైనం తాను చాలా సార్లు చూశానని, ఇప్పుడు ఏ ఒక్క స్టార్‌నో కాకుండా మొత్తం అందరి అభిమాన హీరోలను కలిపేసి రాజా సింగ్ ఘాటు వ్యాఖ్యలు చేశారని తమ్మారెడ్డి తెలిపారు. ఇలాంటి వారికి సినీ స్టార్ల అభిమానులంతా కలిసి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని, తక్షణమే రంగంలోకి దిగాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. ఓ ఎమ్మెల్యేపైకి సినీ నటుల అభిమానులను ఉసిగొల్పుతూ తమ్మారెడ్డి పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయిందని చెప్పాలి. అంతేకాకుండా తమ్మారెడ్డి వాదనతో ఏకీభవించిన చాలా మంది నెటిజన్లు...రాజా సింగ్‌పై ఉద్యమం మొదలుపెడితే తామంతా కలిసి వస్తామని కూడా శపథం చేసేశారు. చూద్దాం... మరి ఏం జరుగుతుందో.
Full View