2019 ఎన్నికల కోసం పరుగులు తీస్తున్న పవన్ కల్యాణ్ యాత్ర ప్రారంభిస్తానని ప్రకటించిన నేపథ్యంలో టాలీవుడ్ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ విమర్శనాత్మక సూచనలు చేశారు. యూట్యూబ్ వేదికగా ఆయన ఈరోజు మాట్లాడుతూ... యాత్రకు వెళ్లేముందు ప్రజలకు పవన్ అజెండా గురించి తెలియజెప్పాల్సిన అవసరం ఉందన్నారు. దాంతో పాటు వచ్చే ఎన్నికల్లో నిలబెట్టేందుకు సరైన అభ్యర్థులను కూడా ఇప్పుడే ఎంపిక చేసుకోవాలన్నారు. 175 నియోజకవర్గాలలో పర్యటించి.. ఊరూరా తిరుగుతూ నీతినిజాయితీగలవారు - యువత నుంచి అభ్యర్థులను ఎంపిక చేసుకోవాలని సూచించారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కూడా ఇలాగే చేశారని.. ప్రతి నియోజకవర్గంలో మంచి అభ్యర్థులను ఎంపిక చేసుకున్నారని..వారంతా అన్నగారు ఉన్నంతవరకు నిబద్ధతతో ఉన్నారని అన్నారు.
పవన్ కూడా ఎన్టీఆర్ మాదిరిగా రాజకీయాల్లో, సమాజంలో మార్పు తెచ్చేందుకు..యువత - నీతిమంతులను రాజకీయాల్లోకి తెచ్చేందుకు కృషి చేయాలని సూచించారు. అంతేకానీ.. తన చుట్టూ ఉన్న కోటరీకి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ప్రయోజనం ఉండదన్నారు.
పవన్ రాజకీయ యాత్ర క్రెడిట్ తనదేనని కూడా తమ్మారెడ్డి అన్నారు. తాను బయటకు వస్తే సెక్యూరిటీ ప్రాబ్లెం వస్తుందని గతంలో పవన్ అన్నప్పుడు.. తాను స్పందించి.. ప్రాబ్లెం వచ్చినా సరే మీరు జనంలోకి వెళ్లాలని సూచించానని.. ఇప్పుడు తన సూచనను పాటించో కాదో తెలియదు కానీ ఆయన జనంలోకి వెళ్తున్నందుకు మాత్రం ఆనందంగా ఉందని.. ఆ క్రెడిట్ తాను తీసుకుంటానని అన్నారు.