‘‘అవార్డులు రాకపోతే రచ్చరచ్చ చేస్తారు.. కానీ, ప్రత్యేక హోదా కోసం సినిమావాళ్లు ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు’’ అన్న టీడీపీ ఎమ్మెల్సీకి దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. టీడీపీలో ఉన్న సినివాళ్లతో తొలుత దీనిపై మాట్లాడించమని ఆయన సూచించారు. పదవి ఉంది కదా అని చెప్పి బాబూ రాజేంద్రప్రసాద్ సినీ పరిశ్రమపై తన ఇష్టానుసారం వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆయన అన్నారు.
చాలామంది సినిమా వాళ్లు టీడీపీతో కలిసి పనిచేస్తున్నారని, ముందు వాళ్లతో ప్రకటనలు ఇప్పిస్తే - ఆ తర్వాత మిగతావారు మాట్లాడతారని అన్నారు. అక్కడితో ఆగని ఆయన మొన్న నంది అవార్డులను నచ్చినవారందరికీ ఇచ్చుకున్నారు కదా, వారితోనే ప్రత్యేక హోదాపై ప్రకటనలు చేయించాలని అన్నారు. రాజేంద్రప్రసాద్ నోటికొచ్చినట్లు మాట్లాడడం వల్లే తానుకూడా ఇలా మాట్లాడాల్సివస్తోదని అన్నారు.
అంతేకాదు. పవన్ కల్యాణ్ విషయంలో టీడీపీ చేస్తున్న విమర్శలనూ ఆయన తప్పుపట్టారు. టీడీపీకి ఇన్నిరోజులు నచ్చిన పవన్ కల్యాణ్ ఇప్పుడు చెడ్డవాడయ్యాడా? అని ప్రశ్నించారు. పవన్ వెనుక బీజేపీ ఉందని తాను అనుకోవట్లేదని అన్నారు. ఎటువంటి ఆధారాలు లేకుండా నారా లోకేశ్ పై పవన్ ఆరోపణలు చేయడం మాత్రం సబబు కాదని అన్నారు. ఏపీకి ప్రత్యేకహోదాపై ఏపీ ఎంపీలందరూ ఢిల్లీలో చేస్తోంది పొలిటికల్ డ్రామా అని విమర్శించారు. రాజకీయంగా పైచేయి కోసమే కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రకటన చేశారని అన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో అన్ని రాజకీయపార్టీలు ఏకతాటిపైకి వస్తే సినీ పరిశ్రమ కూడా కలిసి వస్తుందని అన్నారు. తమిళనాడులో జల్లికట్టుపై అందరూ ఏకతాటిపైకి వచ్చారు కనుకనే సినీ పరిశ్రమ మద్దతు ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.