కేసీఆర్ నిశ్చింతగా ఉండొచ్చు.. ఇక విలీనం గురించి ఆలోచించకుండా పనిచేసుకుంటూ పోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ ను దెబ్బతీయడానికి ఆయనకు అవకాశం లేకుండా చేస్తున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. అవును కేసీఆర్ ప్రయత్నించకుండానే టీఆర్ ఎస్ లో చేరేందుకు అడుగులు వేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ విలీనానికి పుల్ స్టాప్ పెట్టిన కేసీఆర్ ను.. వద్దు వద్దు విలీనం చేయాల్సిందేనని కాంగ్రెస్ నుంచి వచ్చి టీఆర్ ఎస్ లో చేరుతున్న ఎమ్మెల్యేలు తొందరపెడుతున్నట్టు అయ్యింది.. ఇలా కాంగ్రెస్ నావను ముంచుతోంది ఆ పార్టీ ఎమ్మెల్యేల కావడం గమనించదగ్గ విషయం.
ఇప్పటికే ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. మరో ఐదేళ్లు ప్రతిపక్ష పార్టీగా ఉండాల్సిందే. అంటే పదేళ్లు ప్రతిపక్షంలో నిలబడి తట్టుకోవాలి.అందుకే ఆ పార్టీ నేతలందరూ ఇప్పటికే కారెక్కేశారు. ఇప్పుడు గెలిచిన 19 మంది లో కూడా 11 మంది ఇప్పటికే చేరిపోయారు. ఉన్న వాళ్లు కూడా పక్కచూపులు చూస్తున్నారు..
తాజాగా తాండూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసి చర్చలు జరిపారు. ఆయన కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి కారు ఎక్కడ తథ్యం..దీంతో మరో కాంగ్రెస్ నేత ఆ పార్టీని వీడడం ఖాయంగా కనిపిస్తోంది.
రోహిత్ రెడ్డి మొదట టీఆర్ ఎస్ లోనే ఉండేవారు.. కానీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నాడని టీఆర్ ఎస్ నుంచి బహిష్కరించారు. ఈయన తాండూర్ లో కాంగ్రెస్ టికెట్ పై పోటీచేసి బలమైన మాజీ మంత్రి మహేందర్ రెడ్డినే ఓడించాడు. ఇప్పుడు అదే మాతృసంస్థ టీఆర్ ఎస్ లో చేరుతున్నారు. ఇప్పుడు రోహిత్ రెడ్డి టీఆర్ ఎస్ లో చేరడం.. ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ లో రాజీనామా చేయడంతో రెండు సీట్లు తగ్గి కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా కూడా రద్దు అవుతుంది.. కాంగ్రెస్ శాసనభాపక్షాన్ని టీఆర్ ఎస్ లో విలీనం చేయడానికి ఆస్కారం ఏర్పడింది. టీఆర్ ఎస్ నేతలు ప్రయత్నించకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఈ అవకాశం కల్పించడం ఆ పార్టీ దౌర్భాగ్యంగా చెప్పవచ్చంటున్నారు రాజకీయ విశ్లేషకులు..