ఆపరేషన్ రేవంత్‌రెడ్డి స్టింగ్ ఆపరేషన్ మొత్తంలో ఇప్పటివరకూ తెలుగుదేశం పార్టీకి.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అండ్ కోకు ఊరటనిచ్చే ఒక్క అంశం కూడా చోటు చేసుకోలేదన్న దిగులు అక్కర్లేదు. తాజాగా కేంద్రమంత్రి ఒకరు టెలిఫోన్ ట్యాపింగ్ అంశంపై విచారణ అవసరమని పేర్కొనటం కాస్త సానుకూలాంశంగా చెప్పొచ్చు. టెలిఫోన్లను ట్యాప్ చేసే తీరును కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ తప్పు పడుతున్నారు.
ట్యాపింగ్ విషయంలో తెలుగుదేశం వ్యక్తం చేసిన తీవ్ర అభ్యంతరం సరైనదేనని కేంద్రమంత్రి పేర్కొనటం గమనార్హం. టెలిఫోన్ సారాంశం ఏమిటన్నది పక్కన పెడితే ఒక ముఖ్యమంత్రి ఫోన్‌ను ట్యాపింగ్ చేయటమంటే తీవ్ర అభ్యంతరకరమని పేర్కొన్నారు. టేపుల అంశంపై సమగ్ర విచారణ అవసరమని చెప్పిన ఆయన.. టెలిఫోన్ ట్యాపింగ్‌ను తీవ్రంగా పరిగణించటం చూస్తుంటే.. తెలంగాణ రాష్ట్ర సర్కారు ఇదో ఇబ్బందికర పరిణామంగా చెప్పొచ్చు.