ఏపీలో రాజకీయం శరవేగంగా మారుతోంది. ఎన్నికలు అయిపోయాయి కదా అనుకుంటే , వలసల రాజకీయానికి తెరతీసి రాజకీయాన్ని మరింత వేడెక్కించారు మన రాజకీయనేతలు. ఇక గన్నవరం ఎమ్మెల్యే వంశీ రాజీనామా తరువాత ఏపీలో రాజకీయాలు మరింత రంజుగా మారాయి.ప్రతిపక్ష టీడీపీ, అధికార పార్టీ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఈ వివాదంలో టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ పేరు ఎక్కువగా వినిపించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
వంశీ , నాని , టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటుంటే ..ఈ వివాదానికి సంబంధమే లేని ఎన్టీఆర్ పేరు ఎక్కువగా వినిపించడం ఆశ్చర్యంగా ఉంది. తాజాగా టీడీపీ నేతల మాటలకి కౌంటర్ ఇస్తూ తారక్ పేరుని ప్రస్తావిస్తున్నారు. టీడీపీ పెట్టిన బిక్ష వల్లే నువ్వు ఈ స్థాయిలో ఉన్నావ్ అంటూ టీడీపీ నేతలు మంత్రి నాని ని విమర్శిస్తుంటే ..దీనిపై స్పందించిన నాని ..టీడీపీ తనకు చేసింది ఏమి లేదని.. తనకు, వల్లభనేని వంశీకి కూడా రాజకీయ భిక్ష పెట్టింది జూనియర్ ఎన్టీఆర్ అని కొడాలి నాని స్పష్టం చేశారు. తాను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానంటే.. దానికి జూనియర్ ఎన్టీఆర్ కుటుంబమే కారణమని ఆయన వెల్లడించారు. అలాగే లోకేష్ లాంటి దద్దమ్మ వల్లే టీడీపీ నాశనం అవుతోందని ఘాటు వ్యాఖ్యలు చేసారు.
అలాగే సెల్ఫ్ డిక్లరేషన్ అంశంపై కూడా స్పందించిన మంత్రి నాని.. తన పేరులోనే వెంకటేశ్వర అని ఉందని .. శ్రీవారిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. చంద్రబాబుని అన్న మాటలకు తాను కట్టుబడి ఉన్నాను అని చెప్పారు. సీఎం జగన్మోహన్ రెడ్డి తిరుమలను సందర్శించడం ఇదేం మొదటిసారి కాదు. గతంలో పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు.. అంతేకాకుండా ముగించిన తర్వాత కూడా జగన్ తిరుపతి వెళ్లారని.. ఆ సమయంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారని కొడాలి నాని గుర్తు చేశారు. అప్పుడు లేని సెల్ఫ్ డిక్లరేషన్ అంశం ఇప్పుడెందుకు వచ్చిందని చంద్రబాబును ప్రశ్నించారు. చంద్రబాబు కావాలని వివాదం సృష్టిస్తున్నారని మండిపడ్డారు.