టార్గెట్ బీసీ... డోలాయ‌మానంలో టీడీపీ..!

Update: 2022-11-09 07:31 GMT
రాష్ట్రంలో బీసీలు త‌మ వెన్నెముక అని చెబుతున్న టీడీపీకి ఇప్పుడు పెద్ద సంక‌టం వ‌చ్చిప‌డింది. ఎం దుకంటే.. ఇదే బీసీల‌ను ఇప్పుడు వైసీపీ కూడా టార్గెట్ చేసింది. అదేస‌మ‌యంలో ప‌వ‌న్ సైతం బీసీల విష‌యాన్ని ప‌దే ప‌దే ప్ర‌స్తావిస్తున్నారు. దీంతో బీసీల ఓటు బ్యాంకు విష‌యం టీడీపీలో ప్ర‌ధానంగా చ‌ర్చ కు వ‌స్తోంది. నిజానికి ఆది నుంచి కూడా బీసీల కేంద్రంగా టీడీపీ రాజ‌కీయాలు చేస్తున్న విష‌యం తెలి సిందే. అయితే.. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో టీడీపీ కొంత మేర‌కు ఇబ్బంది ప‌డింది.

బీసీఓటు బ్యాంకు టీడీపీకి దూర‌మైంది. దీంతో బీసీలు ఎక్కువ‌గా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఎమ్మెల్యేల ను గెలిపించుకోలేక పోయారు. ఇక‌, ఇదే స‌మ‌యంలో వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత బీసీల కేంద్రంగా అనేక ప‌ద‌వులు ఇవ్వ‌డం.. మంత్రివర్గంలోనూ వారికి నాలుగు స్థానాలు కేటాయించ‌డం..(విడ‌ద‌ల ర‌జ‌నీ, గుమ్మ‌నూరు జ‌యరాం, బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, ఉష‌శ్రీచ‌ర‌ణ్‌) వంటివి బీసీల్లో చ‌ర్చ‌కు దారితీశాయి. వారికి వైసీపీ ప్రాధాన్యం ఇస్తోంద‌నే చ‌ర్చ జోరుగా సాగుతోంది.

దీనికి తోడు స్థానిక ప‌ద‌వుల్లోనూ వైసీపీ వారికి ప్రాధాన్యం ఇస్తుండ‌డం గ‌మ‌నార్హం. గ‌త మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో జ‌న‌ర‌ల్‌కు కేటాయించిన మేయ‌ర్ ప‌ద‌వులు కూడా బీసీల‌కు ఇచ్చేసింది. దీనికితోడు బీసీల‌కు అమ‌లు చేస్తున్న కార్య‌క్ర‌మాలు... ఇస్తున్న ప‌థ‌కాల‌ను కూడా పెంచింది. ఈ ప‌రిణామాల‌తో టీడీపీ.. వైసీపీల మ‌ధ్య బీసీల కేంద్రంగా కొన్నాళ్లుగా విమ‌ర్శ‌లు కొన‌సాగుతున్నాయి. బీసీల‌ను వాడుకున్న టీడీపీ అని వైసీపీ ఆరోపిస్తే.. బీసీల‌కు అస‌లు మీరేం చేశారు.. వారికి ప‌ద‌వులు ఇచ్చినా.. తోలు బొమ్మ‌ల్లా చేశారంటూ.. టీడీపీ నిప్పులు చెరుగుతోంది.

క‌ట్ చేస్తే..వీరిమ‌ధ్య వివాదం ఇలా కొన‌సాగుతున్న స‌మ‌యంలోనే ప‌వ‌న్ ఎంట్రీ ఇచ్చారు. బీసీల‌కు అండ‌గా ఉంటామ‌ని.. ఆయ‌న తాజాగా ఇప్ప‌టంలో జ‌రిగిన పాద‌యాత్ర, ఓదార్పు సంద‌ర్భంగా వ్యాఖ్యానించి టీడీపీకి భారీ షాక్ ఇచ్చారు. ఇప్ప‌టి వ‌రకు వైసీపీ తోనే త‌మ‌కు ఇబ్బంది అనుకున్న టీడీపీకి ప‌వ‌న్ నుంచి కూడా ఇలాంటి వ్యాఖ్య‌లు వినిపించ‌డంతో బీసీల ఓటు బ్యాంకుకు మ‌రింత గండి పడుతుందా?  ఇప్పుడు ఏం చేయాలి? అనే చ‌ర్చ టీడీపీలో జోరుగా సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.

మ‌రోవైపు.. అచ్చెన్నాయుడు వంటి నాయ‌కులు ఉన్నా.. బీసీల‌పై పెద్ద‌గా ప్ర‌భావం చూపించ‌లేక పోవ‌డం గ‌మ‌నార్హం. తాజాగా అయ్య‌న్న ఇష్యూను బీసీల‌కు కేంద్రంగా మార్చుకుని, వారిని త‌మ‌వైపు తిప్పుకొనేందుకు టీడీపీ ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది. మ‌రి ఇది ఏమేర‌కు రిజ‌ల్ట్ ఇస్తుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News